Breaking News

రియల్టీపైనే కుబేరుల కన్ను..

Published on Wed, 01/29/2025 - 03:26

న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత సంపన్నులు (హెచ్‌ఎన్‌ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు) రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇన్వెస్ట్‌ చేయడంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వచ్చే రెండేళ్లలో రియల్టీపై గణనీయంగా పెట్టుబడులు పెట్టాలని 62 శాతం మంది పైగా కుబేరులు భావిస్తున్నారు. సంపన్నుల పెట్టుబడుల ధోరణులపై లగ్జరీ ప్రాపర్టీలకు సంబంధించిన రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ ఇండియా సోత్‌బీస్‌ ఇంటర్నేషనల్‌ రియల్టీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పెద్ద నగరాలకు చెందిన 623 మంది హెచ్‌ఎన్‌ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు ఇందులో పాల్గొన్నారు.

ఈ సర్వే ప్రకారం, భారత ఆర్థిక వృద్ధిపై ఆశాభావం కాస్త నెమ్మదించినప్పటికీ, వృద్ధి పటిష్టంగానే ఉండగలదనే అంచనాలు ఉన్నాయి. 2024లో ఆశాభావం 79 శాతంగా ఉండగా 2025 సర్వేలో ఇది 71 శాతానికి నెమ్మదించింది. అయినప్పటికీ, దేశ జీడీపీ వృద్ధి 6 శాతం నుంచి 6.5 శాతం వరకు ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. భారత్‌ అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగానే కొనసాగుతుందని చాలా మటుకు హెచ్‌ఎన్‌ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు విశ్వసిస్తున్నారు.

‘ఏడాది, రెండేళ్లలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇన్వెస్ట్‌ చేయాలని భావిస్తున్న సంపన్నుల సంఖ్య 2024లో 71 శాతంగా ఉండగా 2025లో 62 శాతానికి పరిమితమైంది. అయినప్పటికీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన సాధనంగా రియల్టీపై ఇంకా గట్టి నమ్మకం ఉండటాన్ని ఇది సూచిస్తుంది‘ అని నివేదిక వివరించింది.  

రాబడులపై ఆశాభావం.. 
పెట్టుబడి గణనీయంగా వృద్ధి చెందుతుందనే అంచనాలే, లగ్జరీ రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ప్రధాన కారణమని సంపన్నులు వెల్లడించారు. 2024లో ఇలా చెప్పిన వారి సంఖ్య 44 %గా ఉండగా ప్రస్తుతం ఇది 55 శాతానికి పెరిగింది. ఇక రియల్టీ పెట్టుబడులపై రాబడులు 12–18% స్థాయిలో ఉంటాయని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఆశాభావంతో ఉన్నారు. 38% మంది మాత్రం ఇది 12% కన్నా తక్కువే ఉంటుందని భావించగా .. 18 శాతానికి మించి ఉంటుందని 15%మంది అభిప్రాయపడ్డారు.

‘కాస్త ఆచితూచి వ్యవహరించే ధోరణి నెలకొన్నా, దేశీయంగా లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ వృద్ధి కొనసాగుతుంది. ముఖ్యంగా విశాలమైన ఫార్మ్‌హౌస్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలు మొదలైన వాటికి డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్నాం‘ అని ఇండియా సోత్‌బీస్‌ ఇంటర్నేషనల్‌ రియల్టీ ఎండీ అమిత్‌ గోయల్‌ తెలిపారు. ఒకప్పుడు హోదాకు చిహ్నంగా నిల్చిన లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ ప్రస్తుతం మెరుగైన పెట్టుబడి సాధనంగా మారిందని సంస్థ సీఈవో అశ్విన్‌ చడ్ఢా పేర్కొన్నారు.

బిలియనీర్ల బూస్ట్‌..
దేశీయంగా బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం సైతం రియల్టీకి కలిసొస్తోందని నివేదిక పేర్కొంది. యూబీఎస్‌ నివేదికను ఉటంకిస్తూ, కుబేరుల సమష్టి సంపద 42 శాతం వృద్ధి చెంది ఏకంగా దాదాపు 905 బిలియన్‌ డాలర్ల స్థాయిని దాటిందని వివరించింది. గత దశాబ్దకాలంలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య రెట్టింపై 185కి చేరుకోగా, మొత్తం సంపద మూడు రెట్లు పెరిగినట్లు తెలిపింది. దీంతో అంతర్జాతీయంగా అత్యధిక సంఖ్యలో కుబేరులకు కేంద్రంగా అమెరికా, చైనా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉన్నట్లు వివరించింది

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)