Breaking News

ఉన్నట్టుండి సీఈవోను తొలగించిన లగ్జరీ బ్రాండ్‌

Published on Mon, 07/15/2024 - 15:57

ప్రముఖ బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ బుర్బెర్రీ ఉన్నట్టుండి తమ సీఈవోను మార్చేసింది. బోర్డ్‌ పరస్పర అంగీకారంతో సీఈవో జొనాథన్‌ అకెరాయిడ్‌ తక్షణం పదవి నుంచి వైదొలగుతున్నారని, కంపెనీని వీడుతున్నారని కంపెనీ తాజాగా ప్రకటించింది.

అకెరాయిడ్‌ స్థానంలో మైఖేల్ కోర్స్ మాజీ బాస్ జాషువా షుల్‌మాన్‌ను దాని కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బుర్బెర్రీ నియమించింది. అమ్మకాలు క్షీణించడంతో నష్టాలు తప్పవన్న సంకేతాలతో డివిడెండ్‌ను రద్దు చేసిన కంపెనీ.. సీఈవో జొనాథన్‌ అకెరాయిడ్‌పైనా వేటు వేసింది.

లగ్జరీ సెక్టార్‌లో మందగమనం ప్రత్యర్థి బ్రాండ్‌ల కంటే బుర్బెర్రీని తీవ్రంగా దెబ్బతీసింది. 168 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బ్రిటిష్ కంపెనీలో ఏకంగా సీఈవో మార్పునకు దారితీసింది.  జూన్ 29 వరకు 13 వారాలలో బుర్బెర్రీ అమ్మకాలు 21% క్షీణించాయి. ప్రస్తుత ట్రెండ్స్‌ వార్షిక లాభాల అంచనాలను దెబ్బతీసిన నేపథ్యంలో వృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి ఈ సంవత్సరం డివిడెండ్‌ను కంపెనీ రద్దు చేసింది.

షుల్‌మాన్ 2021-2022 వరకు యూఎస్‌ బ్రాండ్ మైఖేల్ కోర్స్‌కు సీఈవోగా పనిచేశారు. అంతకుముందు కోచ్‌ కంపెనీకి బ్రాండ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బుర్బెర్రీలో షేర్లు గత 12 నెలల్లో వాటి విలువలో 57% నష్టపోయాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)