Breaking News

‘లుపిన్‌’ రెండు మధుమేహ ఔషధాల కొనుగోలు

Published on Sat, 08/19/2023 - 04:56

న్యూఢిల్లీ: మధుమేహ చికిత్సలో వినియోగించే రెండు ఔషధాలను బోరింగర్‌ ఇంగల్‌హామ్‌ నుంచి కొనుగోలు చేసినట్టు ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్‌ శుక్రవారం ప్రకటించింది. ఎంతకు కొనుగోలు చేసిందన్నది వెల్లడించలేదు. ‘ఆండెరో’ (లినాగ్లిప్టిన్‌), ‘ఆండెరో మెట్‌’(లినాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్‌)ను ట్రేడ్‌మార్క్‌ హక్కులు సహా కొనుగోలు చేసినట్టు తెలిపింది. నిజానికి ఈ రెండు ఔషధాలను 2015 నుంచి లుపిన్‌ మార్కెటింగ్‌ చేస్తోంది. ఇందుకుగాను బోరింగర్‌ ఇంగెల్‌హామ్‌తో కోమార్కెటింగ్‌ ఒప్పందం కలిగి ఉంది.

ఈ ఔషధాల కొనుగోలుతో యాంటీ డయాబెటిక్‌ విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా తమ స్థానం మరింత బలపడుతుందని లుపిన్‌ తెలిపింది. అలాగే మధుమేహంతో వచ్చే సమస్యలను అధిగమించేందుకు మెరుగైన చికిత్సా అవకాశాలు కలి్పంచాలన్న తమ అంకిత భావాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొంది. మన దేశంలో 18 ఏళ్లకు పైన వయసున్న ప్రజల్లో 7.7 కోట్ల మంది టైప్‌–2 మధుమేహంతో బాధపడుతుండడం గమనార్హం. 2.5 కోట్ల మంది ప్రీడయాబెటిక్‌ (మధుమేహం ముందస్తు) దశలో ఉన్నారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు