Breaking News

గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు.. ఎక్కడ.. ఎంత?

Published on Thu, 08/01/2024 - 15:22

దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరల ధోరణులకు అనుగుణంగా నెలవారీ సవరణలో భాగంగా  హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ గ్యాస్ 19 కిలోల సిలిండర్‌  ధరను రూ. 6.5 పెంచినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు తెలియజేశారు.

రేట్ల సవరణ తర్వాత కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్‌ 19 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 1,646, ముంబైలో రూ.1,605, కోల్‌కతాలో రూ.1,764.50, చెన్నైలో రూ.1,817, హైదరాబాద్‌లో రూ.1,872 గా ఉంది. నాలుగు నెలలుగా వరుస తగ్గింపుల తర్వాత ఈ నెలలో కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు పెంచారు. చివరిసారిగా జూలై 1న రూ. 30 మేర ధర తగ్గింది. నాలుగు నెలల్లో మొత్తంగా రూ.148 తగ్గింది. స్థానిక పన్నులకు అనుగుణంగా వీటి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒ‍క్కోలా ఉంటాయి. అయితే, గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ 14.2 కిలోల సిలిండర్‌ ధర మాత్రం రూ.803 వద్ద ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది.

ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) బెంచ్‌మార్క్ అంతర్జాతీయ ఇంధనం, సగటు ధర, విదేశీ మారక విలువ ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన ఏటీఎఫ్‌, వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి.

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు