Breaking News

పెరిగిన గ్యాస్‌ ధరలు.. 19 కిలోల సిలిండర్‌ కొత్త రేటు..

Published on Mon, 03/02/2026 - 17:32

మార్చి నెలకు ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరించాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ.28 నుంచి రూ.31 వరకు పెరిగాయి. అయితే 14 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం సాధారణ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం.

ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు
రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1740.50 నుంచి రూ.1768.50కు పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.1844.50 నుంచి రూ.1875.50కు చేరింది. ముంబైలో రూ.1692 నుంచి రూ.1720కు పెరిగింది. అలాగే చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1899.50 నుంచి రూ.1929కు,  హైదరాబాద్‌లో రూ. 1,962.50 నుంచి రూ. 1,990.50కు విశాఖపట్నంలో రూ. 1,791.50 నుంచి రూ. 1,822.50కు పెరిగినట్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వెల్లడించాయి.

గృహ ఎల్పీజీ రేట్లు యథాతథం
ఆయిల్ కంపెనీల తాజా వివరాల ప్రకారం 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో ఇది రూ.853కు అందుబాటులో ఉంది. కోల్‌కతాలో రూ.951గా కొనసాగుతోంది. ముంబైలో రూ.852.50గా ఉంది. లక్నోలో గృహ సిలిండర్ ధర రూ.890.50గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రూ. 905, విశాఖపట్నంలో రూ. 861లుగా ఉంది.

కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పు లేకపోవడం సామాన్యులకు కొంత ఊరట కలిగిస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)