షాక్‌.. భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు!

Published on Sun, 10/01/2023 - 09:55

నెల ప్రారంభంలో గ్యాస్‌ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. గత కొన్ని నెలలుగా కమర్షియల్‌ సిలిండర్‌ ధరల్ని తగ్గిస్తూ వస్తున్న కేంద్రం ఒక్కసారిగా రూ.209లు పెంచింది.

అదే సమయంలో గృహ వినియోగదారులకు మాత్రం ధరల పెరుగుదల నుంచి ఊరట లభించింది. డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరల్ని స్థిరంగా ఉంచింది. 

నేటి నుంచి పెరిగిన ధరలతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1731.50కి చేరింది. కోల్‌కతాలో రూ.1839.50, చెన్నైలో రూ.1898, ముంబైలో రూ.1684గా ఉంది. 

సిలిండర్‌ మీద సబ్సిడీ
ఈ ఏడాది ప్రారంభంలో, దేశంలోని 330 మిలియన్ల వినియోగదారుల ఎల్‌పీజీ గ్యాస్‌ ధరల్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. ఆగస్టు 29న జరిగిన క్యాబినెట్‌ మీటింగ్‌లో ‘ఎల్‌పీజీ సిలిండర్‌ల గృహ వినియోగదారులందరికీ సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీ లభిస్తుంది.

పీఎం ఉజ్వల పథకం కింద ఉన్న వినియోగదారులు ప్రస్తుత సబ్సిడీపై ఈ సబ్సిడీని పొందుతారు, ”అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రక్షా బంధన్, ఓనం కానుకగా ఎల్‌పీజీ సిలిండర్‌లపై అదనపు సబ్సిడీ తక్షణమే అమల్లోకి వచ్చిందని అన్నారు. దీంతో ఉజ్వల లబ్ధిదారులకు ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.400 సబ్సిడీ పొందే అవకాశం లభించినట్లైంది.

చదవండి👉 ఎలాన్‌ మస్క్‌ క్రియేటర్లకు వందల కోట్లు చెల్లిస్తున్నారు.. మీరు తీసుకున్నారా?

Videos

బాహుబలి వర్సెస్ బుజ్జి

హిమాలయాల్లో రజినీకాంత్..

తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం

భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?

తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై చంద్రబాబు రీ కౌంటింగ్..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో హోరాహోరీ పోరు

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్

YSRCPదే ప్రభంజనం..

Photos

+5

Aditi Rao-Siddharth Tuscany Vacation: త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)