Breaking News

పొట్టి రైడర్లకు బెస్ట్ బైక్స్ ఇవే!

Published on Sat, 08/01/2026 - 20:15

సాధారణంగా ఒక మోటార్‌సైకిల్ కొనుగోలు చేసే సమయంలో ఇంజిన్ పవర్, మైలేజ్, డిజైన్ మాత్రమే కాదు.. సీట్ హైట్ కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే.. తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు బైక్‌ను కంట్రోల్ చేయడంలో సీట్ హైట్ కీలక పాత్ర పోషిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆపినప్పుడు రెండు కాళ్లు నేలను తాకడం, బైక్‌ను బ్యాలెన్స్ చేయడం సులభంగా ఉండాలంటే.. తక్కువ సీట్ హైట్ ఉన్న బైక్‌లు చాలా ఉపయోగపడతాయి.

సీట్ హైట్ ఒక్కటే మాత్రమే సౌకర్యవంతమైన రైడింగ్ ఇస్తుందని చెప్పలేము. సీట్ వెడల్పు, బైక్ బరువు వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ.. పొట్టి రైడర్లు ముందుగా పరిశీలించాల్సిన ముఖ్యమైన స్పెసిఫికేషన్ సీట్ హైట్. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.77 వేల నుంచి రూ.1.85 లక్షల ధరల మధ్య 800 మిమీ కంటే తక్కువ సీట్ హైట్ కలిగిన కొన్ని మంచి బైక్స్ అందుబాటులో ఉన్నాయి.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160
తక్కువ సీట్ హైట్ కలిగిన బైక్ అంటే ముందుగా గుర్తొచ్చేది.. బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160. దీని సీట్ హైట్ కేవలం 737 మిమీ మాత్రమే. క్రూయిజర్ డిజైన్‌తో వచ్చే ఈ బైక్‌లో ఫార్వర్డ్ సెట్ ఫుట్‌పెగ్స్ ఉంటాయి. దీంతో రైడర్ కాళ్లు సహజమైన పొజిషన్‌లో ఉంటాయి. తక్కువ ఎత్తు ఉన్నవారికి పెద్ద ఇంజిన్ కలిగిన బైక్‌లలో ఇది సులభంగా కంట్రోల్ చేయగల ఆప్షన్‌గా నిలుస్తుంది.

టీవీఎస్ రైడర్ 125
780మిమీ సీట్ హైట్ కలిగిన టీవీఎస్ రైడర్ 125 ప్రధానంగా రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించిన కమ్యూటర్ బైక్. సన్నగా ఉండే సీట్, తక్కువ బరువు కారణంగా ట్రాఫిక్‌లో హ్యాండిల్ చేయడం సులభంగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఎక్కువగా బైక్ నడిపే పొట్టి రైడర్లకు ఇది మంచి ఎంపిక.

హీరో స్ప్లెండర్ ప్లస్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో ఒకటి హీరో స్ప్లెండర్ ప్లస్. ఇది కూడా తక్కువ సీట్ హైట్ కలిగి ఉంటుంది. దీని సీట్ హైట్ 785 మిమీ మాత్రమే. తక్కువ బరువు, సన్నని బాడీ డిజైన్ కారణంగా పార్కింగ్ లేదా నెమ్మదిగా నడిపే సమయంలో కూడా సులభంగా కంట్రోల్ చేయవచ్చు. మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.

బజాజ్ పల్సర్ 150
785 మిమీ సీట్ హైట్ కలిగిన బజాజ్ పల్సర్ 150 కూడా మన జాబితాలో ఒకటి. స్ప్లెండర్‌తో పోలిస్తే.. ఈ బైక్ ట్యాంక్ కొంచెం వెడల్పుగా ఉంటుంది. కాబట్టి 5 అడుగుల 4 అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు కొనుగోలు చేసే ముందు ఒకసారి బైక్‌పై కూర్చొని చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సీట్ హైట్ తక్కువగా ఉన్నా, ట్యాంక్ వెడల్పు వల్ల కొందరికి కాళ్లు నేలకు పెట్టడం కాస్త భిన్నంగా అనిపించవచ్చు.

జావా 42
రెట్రో డిజైన్‌తో ఆకట్టుకునే జావా 42 బైక్ సీట్ హైట్ 788 మిమీ. దీని రౌండెడ్ సీట్ డిజైన్ కారణంగా రైడర్ కాళ్లు దగ్గరగా ఉంచుకోవచ్చు. అందువల్ల సీట్ హైట్ కంటే కూడా రైడింగ్ అనుభూతి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది ఈ జాబితాలో కొంచెం ఖరీదైన బైక్ అయినప్పటికీ, ప్రత్యేకమైన డిజైన్ కోరుకునే వారికి మంచి ఎంపిక.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350
ఈ జాబితాలో కొంత ఎక్కువ హైట్ ఉన్న సీట్ కలిగిన బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350. దీని సీట్ హైట్ 790 మిమీ. చిన్న వీల్‌బేస్, కాంపాక్ట్ డిజైన్ కారణంగా బైక్ పెద్దగా అనిపించదు. ఇందులో 349 సీసీ ఇంజిన్ ఉన్నప్పటికీ.. నగర రోడ్లపై సులభంగా నడపగలిగేలా రూపొందించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)