Breaking News

‘లౌడ్‌ లర్నింగ్‌’.. స్కిల్స్‌ నేర్చుకునేందుకు ఇదే మంత్రం!

Published on Wed, 06/19/2024 - 22:33

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రొఫెషనల్స్ తమ కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవడం అత్యంత ఆవశ్యకరం. అయితే అందరూ కొత్త స్కిల్స్‌ నేర్చుకుంటున్నారా.. ఇందులో ఎదురవుతున్న అడ్డంకులు ఏంటి.. అన్నదానిపై ప్రొఫెషనల్ నెట్‌వర్క్ లింక్డ్ఇన్ ఓ పరిశోధన చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

భారత్‌లో 80 శాతం మంది నిపుణులు తమ సంస్థ అభ్యసన సంస్కృతిని పెంపొందించడానికి తగినంత కృషి చేస్తోందని చెప్పారు. అయితే 10లో 9 మందికి పైగా (94%) పని, కుటుంబ కట్టుబాట్ల కారణంగా నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం కష్టపడున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. కుటుంబ బాధ్యతలు లేదా ఇతర వ్యక్తిగత కట్టుబాట్ల కారణంగా సమయం లేకపోవడం (34 శాతం), బిజీ వర్క్‌ షెడ్యూల్స్ (29 శాతం), అభ్యాస వనరులు అందుబాటులో లేవపోవడం (26 శాతం) వంటి ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయి.

ఏంటీ 'లౌడ్ లెర్నింగ్'? 
అప్ స్కిల్లింగ్ కు అడ్డంకులను అధిగమించడానికి ప్రొఫెషనల్స్ లౌడ్ లర్నింగ్ అనే మంత్రాన్నిపాటిస్తున్నారు. పని చేసే చోట అభ్యసన ఆకాంక్షల గురించి బయటకు చెప్పడమే 'లౌడ్ లెర్నింగ్'. అప్ స్కిల్లింగ్ అడ్డంకులకు ఒక ఆశాజనక పరిష్కారంగా ఉద్భవించింది. భారత్‌లో 10లో 8 మంది (81 శాతం) ప్రొఫెషనల్స్‌ ఈ అభ్యాసం వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమయాన్ని కేటాయించడానికి సహాయపడుతుందని చెప్పారు.

'లౌడ్ లెర్నింగ్'లో మూడు ప్రధాన మార్గాలను భారత్‌లోని ప్రొఫెషనల్స్‌ పాటిస్తున్నారు.  తమ అభ్యసనలను సహచరులతో పంచుకోవడం (40 శాతం),  అభ్యసన ప్రయాణం లేదా విజయాలను లింక్డ్ఇన్‌లో షేర్‌ చేయడం (40శాతం),  తమ లర్నింగ్‌ టైమ్‌ బ్లాక్‌ల గురించి వారి టీమ్‌ సభ్యులకు తెలియజేయడం (35శాతం) ఇందులో ఉ‍న్నాయి. భారత్ లో ఇప్పటికే 64 శాతం మంది ప్రొఫెషనల్స్ ఈ 'లౌడ్ లెర్నింగ్ 'లో నిమగ్నమయ్యారు.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)