Breaking News

పాలసీదారులను మోసం చేస్తున్న బీమా ప్లాట్‌ఫామ్‌లు

Published on Fri, 05/17/2024 - 14:57

ఆన్‌లైన్‌ బీమా ప్లాట్‌ఫామ్‌లు పాలసీ సమయంలో మోసపూరిత పద్ధతులను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు లోకల్‌సర్కిల్స్‌ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 36వేల మంది పాలసీదారులు ఈ సర్వేలో పాల్గొన్నారని సంస్థ తెలిపింది. ఇందులో 66 శాతం మంది పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నట్లు చెప్పింది. 49% మంది టైర్ 1 సిటీ నుంచి, 24% మంది టైర్ 2 సిటీ, 27% మంది టైర్ 3, 4, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు సర్వేలో పాల్గొన్నట్లు లోకల్‌సర్కిల్స్‌ తెలియజేసింది.

సర్వేలోని వివరాల ప్రకారం.. ఆన్‌లైన్ బీమాను కొనుగోలు చేసిన 61 శాతం మంది ‘సబ్‌స్క్రిప్షన్ ట్రాప్’లో పడుతున్నారు. తర్వాత తమ పాలసీని రద్దు చేసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. 86% బీమా ప్లాట్‌ఫారమ్‌లు తరచూ ‘నగ్గింగ్’ విధానాన్ని ఉపయోగిస్తున్నాయి. పాలసీని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సరైన పరిష్కారం చూపకుండా సందేశాలతో సమాధానమిస్తున్నాయి. 57% మంది పాలసీదారుల నుంచి ఆన్‌లైన్‌ బీమా ప్లాట్‌ఫామ్‌లు అనవసరమైన వ్యక్తిగత వివరాలు కోరుతున్నాయి. ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి.

‘జీవిత బీమా, ఆరోగ్య బీమా, మోటారు, ఆస్తి.. వంటి బీమా పాలసీలను అమ్మేప్పుడు పాలసీదారులకు ఏజెంట్లు పూర్తి వివరాలు తెలియజేయడం లేదు. తమ టార్గెట్లు చేరుకోవాలనే ప్రయత్నంలో ఎక్కువ ఇన్సెంటివ్‌ ఉన్నవాటికే ఏజెంట్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులోని పరిమితులు, నిబంధనలను చెప్పడంలేదు. పాలసీదారులు కూడా ఆ ‘టర్మ్స్‌ అండ్‌ కండిషన్‌’ పత్రాలను పూర్తిగా చదవకుండానే పూర్తిగా ఏజెంట్‌ను నమ్మి బీమా తీసుకుంటున్నారు. ఏదైనా ఒక పాలసీ పరిమిత కాలంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇస్తూ లేనిఅత్యవసరాన్ని సృష్టిస్తున్నారు’ అని లోకల్‌ సర్కిల్స్‌ తెలిపింది.

ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీమా రెన్యువల్‌, రద్దుకు సంబంధించిన ఫిర్యాదులు అధికమవుతున్నాయని నివేదిక తెలిపింది. గత 9 నెలల్లో ఆన్‌లైన్ బీమా ప్లాట్‌ఫామ్‌లపై మిస్ సెల్లింగ్, మానిప్యులేటివ్ సెల్లింగ్ ఫిర్యాదులు ఎక్కువయ్యాయని సర్వే ద్వారా తెలిసింది.

ఇదీ చదవండి: ట్రక్‌ట్యాక్సీను ఢీకొట్టిన 180 మంది ప్రయాణిస్తున్న విమానం!

ఆన్‌లైన్‌ బీమా ప్లాట్‌ఫామ్‌లు పాటించకూడని 13 అంశాలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతేడాది నవంబర్‌లో నిషేధం విధించినట్లు నివేదిక తెలిపింది. అందులో ప్రధానంగా అత్యవసరాన్ని సృష్టించడం, వినియోగదారులకు పాలసీ లేదంటూ హేళన చేయడం, బలవంతంగా పాలసీని కట్టబెట్టడం, సబ్‌స్క్రిప్షన్ ట్రాప్, ప్లాన్‌ ధర తగ్గినట్లు చూపడం, అస్పష్టమైన ప్రకటనలు.. వంటి అంశాలపై నిషేధం విధించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)