Breaking News

లిక్విడిటీ లోటు రూ.3 లక్షల కోట్లు

Published on Sat, 01/25/2025 - 10:16

భారతీయ బ్యాంకింగ్(Banking) వ్యవస్థలో లిక్విడిటీ లోటు గరిష్ఠ స్థాయికి చేరింది. తాజాగా ఈ లోటు ఏకంగా రూ.3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అమెరికా డాలర్‌(US Dollar)తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా పడిపోతుండడం, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు అధికమవడం, యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలు లిక్విడిటీ తగ్గడానికి కారణమవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

లిక్విడిటీ లోటుకు కొన్ని కారణాలను మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే భారీగా పడుతున్న రూపాయి విలువను కాపాడేందుకు ఆర్‌బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయిస్తోంది. పన్ను చెల్లింపులకు సంబంధించిన అవుట్ ఫ్లోలు కూడా లిక్విడిటీ లోటు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఆర్‌బీఐ వద్ద ప్రభుత్వ నగదు నిల్వలు పెరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.

ఆర్‌బీఐ స్పందన..

లిక్విడిటీ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆర్‌బీఐ విభిన్న చర్యలు తీసుకుటోంది. ఆర్‌బీఐ వేరియబుల్ రెపో రేటు (వీఆర్ఆర్-షార్ట్‌టర్మ్‌లో బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు ఆర్‌బీఐ అప్పులు ఇవ్వడం) ఆక్షన్లను పెంచింది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి లిక్విడిటీని చొప్పించడానికి రోజువారీ వేలం నిర్వహిస్తుంది. జనవరి 23న ఆర్బీఐ రూ.3.15 లక్షల కోట్లను వ్యవస్థలోకి చొప్పించింది. బ్యాంకు నిల్వల నిర్వహణలో అంతరాన్ని సర్దుబాటు చేసిన తర్వాత కూడా లోటు రూ.3.3 లక్షల కోట్లకు పైగానే ఉంది.

ఇదీ చదవండి: ఫుడ్ కేటరింగ్ పునరుద్ధరణకు భాగస్వామ్యం

నగదు నిల్వల నిష్పత్తిని (CRR) నికర డిపాజిట్లలో 4 శాతానికి తగ్గించిన ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి దాదాపు రూ.1.16 లక్షల కోట్ల లిక్విడిటీని ఇటీవల విడుదల చేసింది. ఇది కూడా లిక్విడిటీ లోటు సమస్యకు కారణమని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే నెలలో జరగనున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశం కీలకంగా మారనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)