Breaking News

కొత్త పాలసీల ప్రీమియంలో కనిపించని వృద్ధి

Published on Mon, 07/17/2023 - 04:27

ముంబై: జీవిత బీమా కంపెనీలు కొత్త పాలసీల ప్రీమియం రూపంలో జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.73,005 కోట్లను సమకూర్చుకున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన ప్రీమియం ఆదాయం రూ.73,674 కోట్లతో పోల్చి చూస్తే నికరంగా 0.9 శాతం మేర క్షీణించింది. జీవిత బీమా రంగంలోనే దిగ్గజ సంస్థ అయిన ఎల్‌ఐసీపై ఎక్కువ ప్రభావం పడింది. క్రితం ఏడాది జూన్‌ త్రైమాసికంలో జీవిత బీమా కంపెనీల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 40 శాతం వృద్ధి చెందడం గమనార్హం. జూన్‌ క్వార్టర్‌లో ఎల్‌ఐసీ న్యూ బిజినెస్‌ ప్రీమియం ఆదాయం 7 శాతం క్షీణించి రూ.44,837 కోట్లకు పరిమితమైంది.(ఎస్‌బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!)

ఇండివిడ్యువల్‌ (వ్యక్తుల) సింగిల్‌ ప్రీమియం ఆదాయం 1.4 శాతం తగ్గి రూ.4,568 కోట్లుగా ఉంది. కానీ, క్రితం ఏడాది ఇదే కాలంలో ఎల్‌ఐసీ ఈ విభాగంలో 38 శాతం ప్రీమియం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఇండివిడ్యువల్‌ నాన్‌ సింగిల్‌ ప్రీమియం ఆదాయం 6.6 శాతం తగ్గి రూ.5,871 కోట్లుగా ఉంది. గ్రూప్‌ సింగిల్‌ ప్రీమియం 7.4 శాతం తగ్గి రూ.33,465 కోట్లుగా నమోదైంది. జూన్‌ త్రైమాసికం చివరి నెలలో మాత్రం ఎల్‌ఐసీ తొలి ఏడాది ప్రీమియం ఆదాయంలో 18.3 శాతం వృద్ధిని చూపించింది. మే నెలలో 4.1 శాతం క్షీణతతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించింది. ఇక ప్రైవేటు జీవిత బీమా సంస్థలు అన్నింటి నూతన ప్రీమియం ఆదాయం జూన్‌ క్వార్టర్‌లో 10.6 శాతం పెరిగి రూ.28,168 కోట్లుగా నమోదైంది.  (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్‌ అద్భుతమైన పిక్స్‌ వైరల్‌!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)