Breaking News

ఎల్‌ఐసీకి మంచి లాభం! కలిసొచ్చిన ‘కొత్త బిజినెస్‌’

Published on Fri, 02/06/2026 - 08:55

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 17 శాతం జంప్‌చేసి రూ. 12,958 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 11,056 కోట్లు ఆర్జించింది.

ప్రీమియం ఆదాయం రూ. 1,06,891 కోట్ల నుంచి రూ. 1,25,613 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,01,994 కోట్ల నుంచి రూ. 2,33,984 కోట్లకు బలపడింది. నికర కమిషన్‌ చెల్లింపులు రూ. 5,966 కోట్ల నుంచి రూ. 6,011 కోట్లకు పెరిగాయి. తొలి ఏడాది ప్రీమియం(కొత్త బిజినెస్‌) రూ. 7,285 కోట్ల నుంచి రూ. 10,605 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేరు బీఎస్‌ఈలో 0.7 శాతం బలపడి రూ. 840 వద్ద ముగిసింది.  

ఈ త్రైమాసికంలో వ్యయ నియంత్రణ, పెట్టుబడి ఆదాయం మెరుగుపడటం, అలాగే కొత్త పాలసీల విక్రయాలు పెరగడం ఎల్‌ఐసీ పనితీరుకు ప్రధానంగా తోడయ్యాయి. పాలసీదారుల సంఖ్య పెరగడం, డిజిటల్‌ సేవల విస్తరణ, కస్టమర్‌ సర్వీస్‌ మెరుగుదల వంటి చర్యలు సంస్థకు దీర్ఘకాల వృద్ధికి బలమివ్వనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాబోయే త్రైమాసికాల్లోనూ స్థిరమైన వృద్ధి కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)