Breaking News

ఎల్‌ఐసీ ఆఫర్‌ సక్సెస్‌

Published on Wed, 08/05/2026 - 00:10

న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) ఆఫర్‌ ఫర్‌ సేల్‌కు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన కనిపించింది. వెరసి దేశీయంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విభాగంలో కొత్త రికార్డ్‌కు తెరతీస్తూ ఏకంగా రూ. 36,400 కోట్ల విలువైన (3.3 రెట్లు అధికంగా) బిడ్స్‌ దాఖలయ్యాయి. ప్రభుత్వం ఒక్కో షేరుకీ రూ. 382 ఫ్లోర్‌ ధరలో తొలుత 2.5 శాతం వాటా(31.62 కోట్ల షేర్లు) ఆఫర్‌ చేసింది.

మంగళవారం(4న) రూ. 383.84 సంకేత ధరలో 94.45 కోట్ల షేర్లకు బిడ్స్‌ నమోదయ్యాయి. దీంతో తొలి రోజు గ్రీన్‌ షూ ఆప్షన్‌ ద్వారా సంస్థాగత ఇన్వెస్టర్లకు 4 శాతం వాటా(50.6 కోట్ల షేర్లు) విక్రయించనున్నట్లు దీపమ్‌ కార్యదర్శి అరునిష్‌ చావ్లా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ బాటలో నేడు(5న) రిటైల్‌ ఇన్వెస్టర్లకు సైతం 10 శాతం డిస్కౌంట్‌ ధరలో బిడ్డింగ్‌(మరో 8.22 కోట్ల షేర్లు)కు విండో ఓపెన్‌ కానుంది. ఆఫర్‌లో భాగంగా ప్రభుత్వం రెండు రోజుల్లో మొత్తం 6.5 శాతం వాటా(82.22 కోట్ల షేర్లు) విక్రయించనున్న సంగతి తెలిసిందే. వెరసి ప్రభుత్వం రూ. 31,000 కోట్లు సమకూర్చుకోనుంది.  

10 శాతం వాటా 
ఆఫర్‌కు ముందు ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా 96.5 శాతంకాగా.. 6.5% వాటా విక్రయంతో 90 శాతానికి దిగిరానుంది. దీంతో కంపెనీలో సాధారణ వాటాదారులకు కనీసం 10% వాటా నిబంధన అమలుకానుంది. 2022 మే నెలలో ప్రభుత్వం ఐపీవో చేపట్టడం ద్వారా ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించిన విషయం విదితమే. షేరుకి రూ. 949 ధరలో రూ. 21,000 కోట్లు అందుకుంది.     
ఎల్‌ఐసీ షేరు బీఎస్‌ఈలో 8% పతనమై రూ. 391 వద్ద ముగిసింది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)