Breaking News

ఏజెంట్లకు భారీగా గ్రాట్యుటీ పెంపు.. ఎంతంటే..

Published on Sat, 12/16/2023 - 08:19

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) తన ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. 

ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా(ఏజెంట్స్‌) రెగ్యులేషన్స్‌, 2017కు సవరణలు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ నియంత్రణలను ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా(ఏజెంట్స్‌) అమెండ్‌మెంట్‌ రెగ్యులేషన్స్‌, 2023గా పరిగణిస్తామని ఎల్‌ఐసీ తెలిపింది. అధికారిక పత్రాన్ని (అఫిషియల్‌ గెజిట్‌) ప్రచురించిన డిసెంబరు 6 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని శుక్రవారం సంస్థ పేర్కొంది. ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం గ్రాట్యుటీ పెంపు, కుటుంబ పింఛను తదితర పలు సంక్షేమ పథకాలకు ఆర్థిక శాఖ సెప్టెంబరులో అనుమతి ఇచ్చింది. తిరిగి నియమితులైన ఏజెంట్లకూ రెన్యువల్‌ కమీషన్‌కు  అర్హత ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఏదైనా పాత ఏజెన్సీ కింద చేసిన వ్యాపారంపై రెన్యువల్‌ కమీషన్‌కు ఎల్‌ఐసీ ఏజెంట్లకు అర్హత లేదు.

ఇదీ చదవండి: ‘ఈవీ’ ఇళ్లు..!

ప్రస్తుతం ఎల్‌ఐసీలో 25 కోట్ల పాలసీ హోల్డర్లు ఉన్నారు. దాదాపు 12 లక్షల ఏజెంట్లు పని చేస్తున్నారు. ఎల్‌ఐసీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5.1 లక్షల కోట్లుగా ఉంది.

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)