Breaking News

నేటితో ఎల్‌ఐసీ ఐపీవో ముగింపు

Published on Mon, 05/09/2022 - 04:57

న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ విజయవంతమైంది. షేరుకి రూ. 902–949 ధరలో ఈ నెల 4న ప్రారంభమైన ఇష్యూ నేడు(9న) ముగియనుంది. ఆదివారానికల్లా ఇష్యూ మొత్తం 1.8 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. దాదాపు 16.21 కోట్ల షేర్లకుగాను 29 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. రిటైలర్ల విభాగంలో ఆఫర్‌ చేసిన 6.9 కోట్ల షేర్లకుగాను 10.99 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి.

పాలసీదారుల నుంచి 5 రెట్లు, ఉద్యోగుల నుంచి 3.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఇక నాన్‌ఇన్‌స్టిట్యూషనల్‌ విభాగంలో 1.24 రెట్లు బిడ్స్‌ దాఖలుకాగా.. క్విబ్‌ కోటాలో మాత్రం 0.67 శాతమే స్పందన కనిపించింది. పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ. 45 చొప్పున ఎల్‌ఐసీ ఐపీవో ధరలో రాయితీ ఇస్తోంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 20,600 కోట్లవరకూ సమకూర్చుకోవాలని చూస్తోంది.  

5 కోట్ల మార్క్‌
తొలిసారి 5 కోట్ల అప్లికేషన్ల మైలురాయిని దాటిన ఐపీవోగా ఎల్‌ఐసీ నిలిచినట్లు పేటీఎమ్‌ మనీ సీఈవో వరుణ్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి భారీ స్పందన కనిపిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో దరఖాస్తుపై సగటు పెట్టుబడికంటే అధికంగా రూ. 29,000 చొప్పున లభిస్తున్నట్లు తెలియజేశారు. యూపీఐ ద్వారా ఐపీవోకు రూ. 5 లక్షలవరకూ అనుమతించడంతో హెచ్‌ఎన్‌ఐ పెట్టుబడులు సైతం తరలివస్తున్నట్లు పేర్కొన్నారు.  

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)