Breaking News

ఉజ్వల భవిష్యత్తు కోసం.. ఎల్ఐసీ స్కీమ్: నెలకు రూ.7000 అకౌంట్‌లోకి

Published on Sat, 08/02/2025 - 08:07

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 'ఎల్ఐసీ బీమా సఖి యోజన'ను ప్రారంభించింది. దీని లక్ష్యం ఏమిటంటే.. మహిళలకు స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని సంపాదించే అవకాశాన్ని అందించడం మాత్రమే కాకుండా.. దీని ద్వారా వారికి సాధికారత కల్పించడం, బీమా అవగాహన.

ఎల్ఐసీ బీమా సఖి యోజన గురించి
దేశవ్యాప్తంగా మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా.. ఎల్ఐసీ బీమా సఖి యోజన పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024 డిసెంబర్ 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకంలో మహిళలు బీమా సఖీలుగా మారడానికి శిక్షణ ఇస్తారు.

ఎల్ఐసీ బీమా సఖి పథకం మహిళలు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా సాధికారత వైపు అడుగులు వేయడానికి వీలు కల్పిస్తుంది. బలమైన మహిళలు, బలమైన భవిష్యత్తు అంటూ.. ఎల్ఐసీ ఇండియా ట్వీట్ చేసింది.

దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు
కనీసం పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

కావలసిన డాక్యుమెంట్స్
➤జనన ధ్రువీకరణ పత్రం
➤అడ్రస్ ప్రూఫ్
➤విద్యా అర్హత సర్టిఫికేట్స్
➤లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

స్టైఫండ్ వివరాలు
ఎల్ఐసీ బీమా సఖి యోజన పథకంలో చేరినవారు మూడు సంవత్సరాల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఈ సమయంలో వారికి నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. మొదటి ఏడాది స్టైపెండ్‌ రూ.7000, రెండో ఏడాది రూ.6000, మూడో ఏడాది రూ.5000 ఉంటుంది. అంతే కాకుండా.. నిబంధనలకు అనుగుణంగా ఇన్సెంటివ్‌లు అందిస్తారు. బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు.

దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు
ప్రస్తుత ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ ఉద్యోగుల దగ్గర బంధువులు (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, అత్తమామలు), పదవీ విరమణ చేసిన కార్పొరేషన్ ఉద్యోగులు, మాజీ ఏజెంట్లు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

Videos

బైకును ఎత్తిండ్రు అన్నలు

నేషనల్ అవార్డుపై అనిల్ రావిపూడి ఫస్ట్ రియాక్షన్

సమంత చేతికి స్పెషల్ రింగ్.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందా..?

ఏం చేస్తారో చేసుకోండి.. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకొక్కడికి..

దొరికిపోతారనే భయంతో సిట్ కుట్రలు

నాపై కోపంతో ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేయకండి

మీ పోరాటం రైతులకు ధైర్యం ఇస్తుంది.. అశోక్ బాబుని పరామర్శించిన పేర్ని నాని

విజయనగరంలో చరణ్.. బీభత్సమైన ఫైట్ సీన్స్ లోడింగ్

చంద్రబాబు ఉన్నంతవరకు రైతులకు భరోసా లేదు: చంద్రబాబు

KSR Comment: లోకేష్ ఖబర్దార్.. ఇక కాచుకో.. YSRCP యాప్ రెడీ!

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్ (ఫొటోలు)

+5

తెల్లజుట్టు.. మూడు కారణాలు..ఐదు పరిష్కారాలు (ఫొటోలు)

+5

శ్రావణ శుక్రవార వ్రతం చేసిన తెలుగు సీరియల్ బ్యూటీస్ (ఫొటోలు)

+5

‘బేబీ’ మూవీ నేషనల్‌ అవార్డు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

బబ్లూ పృథ్వీరాజ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌.. 60 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గానే (ఫోటోలు)

+5

11 నెలలు నీటిలో ఒక్క నెల మాత్రమే బయట ఈ శివాలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

క్యాప్షన్ ఇస్తూ.. పెళ్లి కూతురు గెటప్‌లో నిహారిక (ఫోటోలు)

+5

‘బకాసుర రెస్టారెంట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : భిన్న సంస్కృతుల నృత్య సమ్మేళనం (ఫొటోలు)

+5

శ్రావణ శుక్రవారం పూజలు చేసిన సురేఖవాణి, సుప్రీత (ఫొటోలు)