Breaking News

ఎల్‌ఐసీ కొత్త ఎండీగా ఆర్‌ దొరైస్వామి

Published on Mon, 08/14/2023 - 18:38

LIC appointed MD R Doraiswamy ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ దొరైస్వామి నియమితులయ్యారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ దొరైస్వామిని నియమించినట్లు ప్రకటించింది.సెప్టెంబర్ 1, 2023 నుండి అమలులోకి రానున్నట్టు  ఎల్‌ఐసీ ప్రకటించింది. 2026 ఆగస్టు చివరివరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. దొరైస్వామి ప్రస్తుతం ముంబైలోని కేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ దొరైస్వామిని ఆఫీస్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి లేదా అతని పదవీ విరమణ తేదీ వరకు (అంటే 31.08.2026) వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందైతే అది అమలులోకి వస్తుందని అని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.  గతంలో ఎల్‌ఐసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా సత్‌పాల్ భానూను నియమించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల డైరెక్టర్ల కోసం హెడ్‌హంటర్ అయిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB), ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి సత్ పాల్ భానూ పేరును సిఫార్సు చేసింది.

కాగా  జూన్ 2023తో ముగిసిన త్రైమాసికంలో ఎల్‌ఐసీ భారీ లాభాలను ఆర్జించింది.  గత ఏడాదితో ఇదే క్వార్టర్‌ రూ. 602.79 కోట్లతో పోలిస్తే ఈ కాలంలో లాభం 1498.4 శాతం పెరిగి రూ. 9634.98 కోట్ల లాభాలునమోదు చేసింది. అయితే  నికర ఆదాయం మాత్రం స్వల్పంగా తగ్గి  రూ. 98,755 కోట్లుగా  ఉంది. త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్‌పిఎ) 2.48 శాతంగా ఉంది, ఇది క్రితం సంవత్సరం కాలంలో 5.84 శాతంగా ఉంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)