Breaking News

టీడీఎస్‌ విధించకూడదంటే ఏం చేయాలో తెలుసా..

Published on Tue, 07/09/2024 - 14:50

పన్నుదారులకు టీడీఎస్‌(ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌) విధించకుండా పాన్‌ కార్డు వివరాలు సమర్పించాలని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తన వాటాదార్లను కోరింది. రూ.10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై ఎల్‌ఐసీ రూ.6 డివిడెండ్‌ ప్రకటించింది. వ్యక్తులకు అందే డివిడెండ్‌ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 లోపు ఉంటే టీడీఎస్‌ ఉండదని పేర్కొంది. ఒకవేళ పాన్‌ వివరాలు ఇవ్వకపోయినా, ఇచ్చిన వివరాలు చెల్లకపోయినా (ఆధార్‌-పాన్‌ అనుసంధానం అవ్వకపోతే పాన్‌ చెల్లదు) డివిడెండ్‌పై 20 శాతం టీడీఎస్‌ కట్‌ చేసేకునే అవకాశం ఉందని తెలిపింది.

డివిడెండ్‌ కోసం జులై 19ని రికార్డు తేదీగా ఎల్‌ఐసీ ప్రకటించింది. ఆ రోజు వరకు ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్‌ అకౌంట్‌లో ఎల్‌ఐసీ షేర్లు కలిగి ఉంటే, సెప్టెంబరు 20 లోపుగా డివిడెండ్‌ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. వాటాదార్లు తమ డిపాజిటరీ పార్టిసిపెంట్ల దగ్గర బ్యాంకు ఖాతా వివరాలను మరోసారి తనిఖీ చేసుకోవాలని ఎల్‌ఐసీ తెలిపింది. అవసరమైతే వాటిని అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాకు పాన్‌ను అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. ఒకవేళ బ్యాంకు ఖాతా అందుబాటులో లేకపోతే, అనుమతించిన మార్గాల్లో డివిడెండ్‌ చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, ఆగస్టు 22న వార్షిక సాధారణ సమావేశంలో ఈ అంశంపై మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: బడ్జెట్‌లో రైతన్న కోరుకుంటున్నవి..

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)