Breaking News

ఖరీదైన ఆ బ్రాండ్‌కు బాస్‌ ఇండియన్‌ లేడీ..

Published on Sun, 12/07/2025 - 15:07

షెనల్‌.. ఖరీదైన ఫ్యాషన్‌ ఉత్పత్తులకు పేరుగాంచిన ఈ ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ గురించి లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసేవారికి తెలిసే ఉంటుంది. ‘అమ్మో ఆ బ్యాగ్‌ అన్ని లక్షలా..??’​ అని సామాన్యులు కూడా ఆ బ్రాండ్‌ ఉత్పత్తుల ధరలు విని విస్తుపోతుంటారు. దీనికి బాస్‌ మన భారతీయురాలే. మహారాష్ట్రకు చెందిన లీనా నాయర్.. షెనల్‌కు సీఈవోగా కొనసాగుతున్నారు. 2021 డిసెంబర్ లో ఆమె షెనల్‌కు సీఈవో అయ్యారు.

కొల్హాపూర్ నుంచి గ్లోబల్ లీడర్ షిప్ వరకు..
మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జన్మించిన లీనా నాయర్ మహిళలకు పరిమిత అవకాశాలు ఉన్న సంప్రదాయవాద వాతావరణంలో పెరిగారు. ఆమె వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలయ్యారు. తరువాత ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్‌పూర్‌లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్‌లో ఎంబీఏ అభ్యసించారు. అక్కడ ఆమె బంగారు పతకం సాధించారు.

యూనిలీవర్ లో మూడు దశాబ్దాలు
లీనా నాయర్ 1992లో యూనిలీవర్ లో మేనేజ్ మెంట్ ట్రైనీగా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2016లో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అయ్యారు. ఈ పాత్రను నిర్వహించిన అతి పిన్న వయస్కురాలే కాదు..  మొదటి మహిళ కూడా లీనా కావడం గమనార్హం. యూనిలీవర్ లో, ఆమె 190 కి పైగా దేశాలలో హెచ్‌ఆర్ కార్యకలాపాలను పర్యవేక్షించారు.

షెనెల్‌కు సీఈవోగా
షెనెల్ 2021 డిసెంబర్ 14న నాయర్ ను గ్లోబల్ సీఈవోగా నియమించింది. వేగవంతమైన మార్పు కాలంలో ప్రైవేటుగా నిర్వహించే లగ్జరీ హౌస్ కు మార్గనిర్దేశం చేసే బాధ్యతను ఆమెకు అప్పగించింది. అప్పటి నుండి ఆమె స్థిరత్వం, వైవిధ్యం, హస్త కళా ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఆ బ్రాండ్‌ను మరింత విస్తృతం చేశారు.

ప్రత్యేక గుర్తింపులు
లీనా నాయర్ ప్రసిద్ధ ఫినాన్షియల్‌ టైమ్స్‌ హీరోస్‌ (FT HERoes) ఛాంపియన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ బిజినెస్‌లో చోటు సంపాదించారు. ప్రభావవంతమైన నిర్వహణ ఆలోచనాపరుల థింకర్స్ 50 జాబితాలోనూ స్థానం దక్కించుకున్నారు. లింక్డ్ఇన్ టాప్ వాయిస్ గానూ గౌరవం పొందారు. వ్యాపారం, వైవిధ్యం కోసం ఆమె చేసిన కృషికి ఆమె కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)ను కూడా అందుకున్నారు.

Videos

Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జానియర్ ఎన్టీఆర్

Maoist Leader: మావోలకు భారీ ఎదురుదెబ్బ 3 కోట్లు రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సరెండర్

ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశాం: బొత్స సత్యనారాయణ

ఛీ.. ఛీ.. మీరు రాష్ట్రానికి పట్టిన. రామ్మోహన్ నాయుడు, లోకేష్‌పై రెచ్చిపోయిన KA పాల్

Kethireddy Pedda Reddy: అంతా మీ ఇష్టమా! తాడిపత్రి మీ అడ్డా కాదు

ఇండియాలో స్టార్ లింక్ సబ్ స్క్రిప్షన్ ధరలు ఇవే!

వెంటనే ఆపేయండి.. మెడికల్ కాలేజీల జోలికి పోవద్దు

Tadepalli : పోలీసుల ఓవర్ యాక్షన్ విద్యార్థి నేతలను లారీ ఎక్కించి..!

Machilipatnam: కూటమి నాయకుల మధ్య వాజ్‌పేయి విగ్రహం చిచ్చు

Photos

+5

చేతి వేళ్లన్నంటికీ రింగ్స్.. మృణాల్ ఠాకుర్ ఫ్యాషన్ (ఫొటోలు)

+5

సూర్య కొత్త సినిమా లాంచ్.. హీరోయిన్‌గా నజ్రియా (ఫొటోలు)

+5

అట్టహాసంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం (చిత్రాలు)

+5

Chiranjeevi : మేనేజర్ కుమార్తె బారసాల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు (ఫొటోలు)

+5

నేటి తరానికి స్పూర్తి.. మన 'ప్రగతి' విజయం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఈ కాళీ మాత ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

మడత మంచంపై పడుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్ ట్రిప్‌లో 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ రమ్య మోక్ష లేటేస్ట్ లుక్స్.. ఫోటోలు