Breaking News

లెక్ట్రిక్స్‌ కొత్త స్కూటర్‌

Published on Thu, 07/27/2023 - 06:23

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విభిన్న వ్యాపారాల్లో ఉన్న ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ కంపెనీ లెక్ట్రిక్స్‌ ఈవీ.. కొత్త స్కూటర్‌ను రెండు వేరియంట్లలో ఎల్‌ఎక్స్‌ఎస్‌ జీ3.0, ఎల్‌ఎక్స్‌ఎస్‌ జీ2.0 ట్రిమ్స్‌లో ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.97,999. తొలిసారిగా 12 రకాల ఫీచర్లతో కలుపుకుని మొత్తం 93 రకాల హంగులను జోడించినట్టు లెక్ట్రిక్స్‌ ప్రకటించింది. ఎమర్జెన్సీ ఎస్‌వోఎస్‌ అలర్ట్, నావేగిషన్‌ అసిస్ట్, ఓవర్‌ ద ఎయిర్‌ అప్‌డేట్స్‌ వంటివి ఇందులో ఉన్నాయి.

3 కిలోవాట్‌ బ్యాటరీతో రూపొందిన ఎల్‌ఎక్స్‌ఎస్‌ జీ3.0 ఒకసారి చార్జింగ్‌తో 105 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని 9 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. 2.3 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో ఎల్‌ఎక్స్‌ఎస్‌ జీ2.0 తయారైంది. ఒకసారి చార్జింగ్‌తో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 10.2 సెకన్లలో గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. హర్యానాలోని మనేసర్‌ వద్ద ఉన్న ప్లాంటు సామర్థ్యం ఏటా 1.5 లక్షల యూనిట్లు. ఇప్పటికే లెక్ట్రిక్స్‌ ఈవీ కోసంఎస్‌ఏఆర్‌ గ్రూప్‌ రూ.300 కోట్లు ఖర్చు చేసింది. లుమినస్, లివ్‌గార్డ్, లివ్‌ఫాస్ట్, లివ్‌ప్యూర్‌ బ్రాండ్లను సైతం ఈ గ్రూప్‌ ప్రమోట్‌ చేస్తోంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)