Breaking News

3వేల ఉద్యోగాలు కట్‌: లగ్జరీ కార్‌మేకర్‌ స్పందన ఇది!

Published on Mon, 05/29/2023 - 13:57

సాక్షి, ముంబై: గ్లోబల్‌గా అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే సంస్థ కూడా ఉద్యోగాల తీసివేతకు ఉపక్రమిస్తున్నట్టు తెలుస్తోంది. జెట్ ఇంజిన్ల తయారీదారు రోల్స్ రాయిస్ ప్రపంచవ్యాప్తంగా 3వేల మంది ఉద్యోగులను తొలగిస్తోందని వార్త మీడియాలో పలు నివేదికలు వెలువడ్డాయి. అయితే కంపెనీ  స్పందన మాత్రం  భిన్నంగా  ఉంది.

టైమ్స్‌ నివేదికల ప్రకారం లగ్జరీ ఆటోమొబైల్ తయారీదారు గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుండి 3,000 మంది నాన్-మాన్యుఫ్యాక్చరింగ్ ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. కార్యకలాపాల పునరుద్ధరణలో భాగంగా ఈ తొలగింపులను చేపట్టనుంది. వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్వహణ మార్పులతో సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఇటీవల రోల్స్ రాయిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టుఫాన్ ఎర్గిన్‌బిల్జిక్ ప్రకటించారని కూడా  నివేదించింది. రోల్స్ సివిల్ ఏరోస్పేస్, మిలిటరీ ,పవర్ సిస్టమ్స్ విభాగాల తయారీయేతర వ్యాపారాలను కలపాలని కార్పొరేషన్ భావిస్తోందన్న అంచనాలు వెలువడ్డాయి. 

అవన్నీ ఊహాగానాలే: రోల్స్‌ రాయిస్‌
అయితే ఈ వార్తలను బ్రిటీష్ ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్  ఖండించింది. దీనికి సంబంధించి తాము  ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఉద్యోగుల కోతల వార్తలన్నీ ఊహాగానాలేనని ఈ సందర్బంగా ది సండే టైమ్స్‌ క్లెయిమ్‌లను కంపెనీ తోసిపుచ్చింది.  దీర్గకాల సక్సెస్‌, ఉద్యోగుల శ్రేయస్సే తమ ప్రాధాన్యత అని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. 

కాగా ప్రపంచవ్యాప్త విమానయాన పరిశ్రమ విడి భాగాలు, నిపుణుల కొరతతో ఉత్పత్తి సమస్యలను ఎదుర్కొంటోంది, అలాగే విమాన ఇంజిన్‌లకు టైటానియం వంటి పదార్థాలను సరఫరా చేసే రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడుతోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)