Breaking News

ఇళ్ల విక్రయాలు.. నేలచూపులు

Published on Tue, 12/30/2025 - 08:57

హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌ ఈ ఏడాది నీరసించింది. విక్రయాలు క్రితం ఏడాదితో పోల్చి చూసినప్పుడు 23 శాతం తగ్గి 44,885 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది అమ్మకాలు 58,540 యూనిట్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు 14 శాతం పడిపోయాయి. ఒక్క చైన్నై నగరంలో మాత్రం డిమాండ్‌ పుంజుకుంది. ఇళ్ల యూనిట్ల అమ్మకాలు తగ్గినప్పటికీ, విలువలో మాత్రం వృద్ధి కనిపించింది. ఈ వివరాలను రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ విడుదల చేసింది. ప్రాపర్టీ ధరలు పెరగడం, ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు, భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు విక్రయాలు తగ్గడానికి కారణాలుగా అనరాక్‌ పేర్కొంది. ఏడు నగరాల్లో ఇళ్ల ధరలు ఈ ఏడాది సగటున 8 శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది.  

విక్రయాలు ఇలా..

  • మొత్తం ఏడు నగరాల్లో 2025లో ఇళ్ల అమ్మకాలు ఇప్పటి వరకు 3,95,625 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది విక్రయాలు 4,59,645 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది అమ్ముడుపోయిన ఇళ్ల విలువ రూ.6 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది అమ్మకాల విలువ రూ.5.68 లక్షల కోట్లతో పోలిస్తే 6 శాతం పెరిగింది.  

  • ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో 1,27,875 ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది కంటే 18 శాతం తగ్గాయి.

  • పుణెలోనూ క్రితం ఏడాదితో పోల్చితే 20 శాతం తక్కువగా 65,135 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.

  • బెంగళూరులో 5 శాతం తక్కువగా 65,135 యూనిట్లు అమ్ముడయ్యాయి.

  • ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో విక్రయాలు 57,220 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది విక్రయాలు 61,900 కంటే 8 శాతం తగ్గాయి.

  • కోల్‌కతాలో 16,125 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. క్రితం ఏడాదితో పోలి్చతే 12 శాతం పడిపోయాయి.  

  • చెన్నైలో మాత్రం అమ్మకాలు క్రితం ఏడాదితో పోల్చితే 15 శాతం పెరిగాయి. 22,180 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.  

  • 2024లో ఇళ్ల ధర చదరపు అడుగునకు రూ.8,590గా ఉంటే, ఈ ఏడాది 8 శాతం పెరిగి రూ.9,260కు చేరుకుంది.  

2026 అమ్మకాలు ఎలా ఉండొచ్చు?

క్రితం ఏడాది డబుల్‌ డిజిట్‌ స్థాయిలో ఇళ్ల ధరలు పెరగ్గా.. ఈ ఏడాది సింగిల్‌ డిజిట్‌ పెరుగుదలతో ఆగినట్టు అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు. 2026లో ఇళ్ల మార్కెట్‌ పనితీరు ఎన్నో అంశాలపై ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, ఇళ్ల ధరల తీరు అమ్మకాలను ప్రభావితం చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)