Breaking News

గూగుల్‌, ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్‌.. పాస్‌వర్డ్‌లు లీక్‌

Published on Fri, 06/20/2025 - 12:51

గూగుల్, ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, గిట్‌హబ్‌లోని డెవలపర్ ఖాతాలు, కొన్ని ప్రభుత్వ పోర్టల్స్‌లోని దాదాపు 16 బిలియన్లకు పైగా పాస్‌వర్డ్‌లు లీక్‌ అయినట్లు సైబర్‌న్యూస్‌, ఫోర్బ్స్‌ నివేదికలు తెలిపాయి. ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ లీక్‌ల్లో ఇది ఒకటిగా నిలిచిందని పేర్కొన్నాయి. ఈ లీక్ వల్ల మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటా ప్రమాదంలో ఉందని చెప్పాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఫిషింగ్ స్కామ్‌లు, ఐడెంటిటీ థెఫ్ట్‌, అకౌంట్‌ హ్యాకింగ్‌కు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తి చేశాయి.

లీక్‌ అయిన డేటా ఏళ్ల తరబడి ఉన్న పాత సమాచారం మాత్రమే కాదని భద్రతా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం కొత్త డేటా, బాగా వ్యవస్థీకృతమైన సమాచారం ఉందన్నారు. ఈ లీక్‌ల కోసం సైబర్‌ నేరగాళ్లు ఇన్ఫోస్టీలర్స్ అని పిలువబడే ఒక రకమైన మాల్వేర్‌ను ఉపయోగించి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ మాల్వేర్ ప్రోగ్రామ్‌లు యూజర్లకు తెలియకుండానే తమ పరికరాల నుంచి లాగిన్‌ పాస్‌వర్డ్‌లను దొంగిలించి హ్యాకర్లకు పంపుతాయన్నారు. ఈ సమాచారాన్ని డార్క్ వెబ్ ఫోరమ్‌ల్లో అమ్మకానికి ఉంచుతారని తెలిపారు.

లీకేజీలో ఏముంది?

లీకైన డేటాలో గూగుల్, ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి గిట్‌హబ్‌ల్లోని డెవలపర్ ఖాతాల్లోని సమాచారం ఉందనే అంచానాలున్నాయి. కొన్ని ప్రభుత్వ పోర్టల్స్ లాగిన్ సమాచారం కూడా లీకైందని చెబుతున్నారు. ఈ డేటా అంతా నిర్మాణాత్మకంగా, ఉపయోగించదగినదిగా ఉన్నందున నిపుణులు ఈ లీక్‌ను ‘గ్లోబల్ సైబర్ క్రైమ్ కోసం బ్లూప్రింట్’ అని పిలుస్తున్నారు. దాదాపు 30 బిగ్‌ డేటా సెట్లు, ఒక్కొక్కటి మిలియన్ల నుంచి బిలియన్ల లాగిన్ వివరాలు వివరాలను సేకరించాయని, మొత్తం 16 బిలియన్లకు పైగా పాస్‌వర్డ్‌లను దొంగిలించారని భావిస్తున్నారు.

ఎందుకంత తీవ్రత

దొంగిలించబడిన ఈ డేటాను ఎంత సులభంగా కొనుగోలు చేయవచ్చనే దానిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. పరిమిత సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ మొత్తంలో డబ్బు ఉన్నవారు కూడా డార్క్ వెబ్‌లో ఈ పాస్‌వర్ట్‌లను యాక్సెస్ చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది రోజువారీ వినియోగదారుల నుంచి పెద్ద కంపెనీల వరకు దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది.

ఇదీ చదవండి: వీర్య దానంతో పుట్టినవారికి ఆస్తిలో సమాన వాటా

ఇప్పుడు ఏం చేయాలి?

సంప్రదాయ పాస్‌వర్ట్‌ల నుంచి పాస్ కీ వంటి మరింత సురక్షితమైన ఆప్షన్లకు మారాలని గూగుల్ ఇప్పటికే వినియోగదారులకు సూచించింది. ముఖ్యంగా లాగిన్ వివరాలు అడిగితే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్స్ ద్వారా పంపే లింక్‌లను క్లిక్ చేయవద్దని ఎఫ్‌బీఐ ప్రజలను హెచ్చరించింది. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అన్ని ప్రధాన ఖాతాల్లో పాస్‌వర్డ్‌లను మార్చడం, బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఎ)ను ఆన్‌ చేయడం ద్వారా భవిష్యత్తులో జరిగే మోసాలను కట్టడి చేయవచ్చు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)