Breaking News

బాబ్బాబు ఇక్కడే ఉండు..!

Published on Tue, 09/24/2024 - 05:49

న్యూఢిల్లీ: బడా ప్రైవేటు బ్యాంక్‌లు అధిక ఉద్యోగ వలసలకు (అట్రిషన్‌) కొంత అడ్డుకట్ట వేయగలిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అట్రిషన్‌ రేటు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే తగ్గినట్టు డేటా తెలియజేస్తోంది. ఉద్యోగులు సంస్థతోనే కొనసాగేందుకు వీలుగా బ్యాంక్‌ల యాజమాన్యాలు పలు చర్యలను ఆచరణలో పెట్టడం ఫలితాలనిస్తోంది. 

మేనేజర్లను జవాబుదారీ చేయడం, అధిక ప్రోత్సాహకాలు తదితర చర్యలు ఇందులో భాగంగా ఉన్నాయి. బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో ఇతర సంస్థల మాదిరే బ్యాంక్‌లు సైతం నైపుణ్య మానవ వనరుల పరంగా ఆటుపోట్లను చూస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈవో శశిధర్‌ జగదీశన్‌ తెలిపారు. 2022–23లో ఉద్యోగుల వలసలు బ్యాంక్‌తోపాటు పరిశ్రమకు సైతం ఆందోళన కలిగించినట్టు చెప్పారు.  

30 ఏళ్లలోపు వారే ఎక్కువ.. 
‘2023–24లో వలసలను అడ్డుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పలు చర్యలు తీసుకుంది. ఉద్యోగులు సంస్థను వీడేందుకు గల కారణాలను గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉన్నత స్థాయిలో టాస్‌్కఫోర్స్‌ను సైతం ఏర్పాటు చేశాం’’అని జగదీశన్‌ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అట్రిషన్‌ రేటు 7 శాతం మేర తగ్గి, 27 శాతంగా ఉంది. అదే మహిళా ఉద్యోగుల వలసలు 28 శాతంగా ఉండడం గమనార్హం. 

ముఖ్యంగా ఇలా సంస్థను వీడి వెళ్లే వారిలో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారుంటుంటే, ఆ తర్వాత 30–50 ఏళ్ల వయసులోని వారున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల అనుభవం మెరుగుపడేందుకు వీలుగా తాము ఇన్వెస్ట్‌ చేసినట్టు జగదీశన్‌ వెల్లడించారు. బ్యాంక్‌కు చెందిన లెరి్నంగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఎంపవర్‌’ ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఉద్యోగుల మనోగతం, వారి అభిప్రాయాలను తెలుసుకునే కార్యాచరణను అమలు చేసినట్టు తెలిపారు. 2 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్టు వివరించారు. 2023–24లో 6 లక్షల గంటల అభ్యసనను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నమోదు చేసింది.  

ఇతర బ్యాంకుల్లోనూ.. 
ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లోనూ అట్రిషన్‌ రేటు గత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం మేర తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో 25 శాతం,  యాక్సిస్‌ బ్యాంక్‌లో 29 శాతం, కోటక్‌ బ్యాంక్‌లో 40 శాతం చొప్పున నమోదైంది. ఇక ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లో ఉద్యోగ వలసల రేటు 14 శాతం తగ్గి 37 శాతానికి, యస్‌ బ్యాంక్‌లో 5 శాతం తగ్గి 38 శాతానికి పరిమితమైంది. పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లోనే ఉద్యోగుల వలసలు అధికంగా ఉన్నాయి.

 దీంతో ఈ సంస్థ ఉద్యోగులను కాపాడుకునేందుకు గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో చర్యలు చేపట్టింది. శాఖల వారీగా, రిలేషన్‌షిప్‌ మేనేజర్లు, అసిస్టెంట్‌ ఏరియా మేనేజర్లకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసింది. కొన్ని విభాగాల్లో వేతనాలు, ప్రయోజనాల పరంగా ఆగు నెలల కాలానికి స్థిరమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. బ్రాంచ్‌ మేనేజర్లు, ఏరియా మేనేజర్లకు ప్రోత్సాహకాలు పెంచింది. పోటాపోటీగా వేతన, ప్రోత్సాహక ప్యాకేజీలతో ఉద్యోగులను కాపాడుకునేందుకు, ఆకర్షించేందుకు ప్రముఖ బ్యాంక్‌లు చర్యలు అమలు చేస్తున్నట్టు హంట్‌ పార్ట్‌నర్స్‌కు చెందిన వికమ్ర్‌ గుప్తా తెలిపారు.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు