Breaking News

బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే..

Published on Wed, 01/17/2024 - 13:17

దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్​ సిస్టమ్‌​ను ఏర్పాటు చేయడానికి ఆర్డర్‌ను గెలుచుకున్నట్లు లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) తెలిపింది. ఈ మేరకు ఎల్​ అండ్ టీ కన్‌స్ట్రక్షన్‌ 508 కిలోమీటర్ల పరిధిలో ప్రాజెక్ట్‌ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది. రూట్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత, ఈ ఎలక్ట్రిఫికేషన్​ సిస్టమ్ వల్ల రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌‌కు జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ నిధులు సమకూరుస్తోందని కంపెనీ తెలిపింది.

ఈ ప్రాజెక్ట్‌కు మహారాష్ట్రలో భూసేకరణ దాదాపు పూర్తయిందని ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్ట్‌ పరిధిలో ఉన్న ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: ఉద్యోగాలు పోనున్నాయా..?

దేశంలోనే ఈ తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం జరిగిందని రైల్వే మంత్రి గతంలోనే చెప్పారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్‌ నుంచి ముంబయి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)