Breaking News

లద్దాఖ్‌ అరుదైన రికార్డు.. దేశంలోనే తొలిసారి..

Published on Mon, 10/26/2026 - 11:52

భారతదేశ పర్యావరణ, వ్యవసాయ రంగ చరిత్రలో లద్దాఖ్‌ అరుదైన రికార్డు సాధించింది. సున్నితమైన హిమాలయ ప్రాంత పర్యావరణాన్ని రక్షించడంతోపాటు స్థానిక రైతులకు స్థిరమైన జీవనోపాధిని అందించే లక్ష్యంతో సాగిన సుదీర్ఘ కృషి ఫలించింది. లద్దాఖ్‌ను దేశంలోనే మొట్టమొదటి వంద శాతం సేంద్రియ (ఆర్గానిక్‌) కేంద్రపాలిత ప్రాంతంగా ఆ ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌ కుమార్‌ సక్సేనా అధికారికంగా ప్రకటించారు. ఈ చారిత్రక ప్రకటనతో లద్దాఖ్‌ దేశవ్యాప్తంగా నూతన వ్యవసాయ విప్లవానికి రోల్‌ మోడల్‌గా నిలిచింది.

పూర్తి నిషేధం

అతి సున్నితమైన హిమాలయ ప్రాంత భూభాగాన్ని, అక్కడి జీవ వైవిధ్యాన్ని రక్షించే దిశగా స్థానిక యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వ్యవసాయంలో సింథటిక్‌ ఎరువులు, రసాయన పురుగుమందులు, నేలకు హాని కలిగించే పదార్థాల వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ లద్దాఖ్‌ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. లేహ్, కార్గిల్‌ జిల్లాల పరిధిలో ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేశారు. ప్రత్యేకించి పంటల సాగు సీజన్‌కు ముందే గ్రామాలకు సేంద్రియ ఎరువులను పంపిణీ చేయడంతో పాటు సింథటిక్‌ ఎరువుల కొనుగోలు, పంపిణీ, విక్రయాలపై నిషేధాజ్ఞలు జారీ చేశారు.

గ్రామాలకు అధికారిక ధ్రువీకరణ

ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకునేందుకు అక్కడి యంత్రాంగం గతంలో సిక్కిం స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘మిషన్ ఆర్గానిక్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్’ కింద లెహ్, కార్గిల్ జిల్లాల్లోని వందలాది గ్రామాలను దశలవారీగా సేంద్రియ గ్రామాలుగా తీర్చిదిద్దారు. కార్గిల్, ద్రాస్, జాన్సార్, షామ్ ప్రాంతాల్లోని వందలాది రెవెన్యూ గ్రామాలు ఇప్పటికే ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ను పొందాయి.

స్థానిక పంటలకు గుర్తింపు

ఈ సేంద్రియ హోదా ద్వారా లద్దాఖ్‌లో పండే ప్రత్యేకమైన పంటలకు మార్కెట్లో అపారమైన డిమాండ్ పెరగనుందని అధికారులు చెబుతున్నారు. జీఐ ట్యాగ్ పొందిన ప్రసిద్ధ ‘రక్త్సే కార్పో’ రకం ఆప్రికాట్లు (అంజూరపు పండ్లు), దేశంలోని మొత్తం ‘సీ బక్థార్‌’ సాగులో దాదాపు 70 శాతానికి పైగా ఉన్న లద్దాఖ్‌ అటవీ వ్యవసాయ సంపద, బార్లీ, బక్‌వీట్ (బుడమలు), వివిధ పౌష్టికాహార కూరగాయల ఎగుమతులకు మార్గం సుగమమైంది.

ఇదీ చదవండి: గాంధీజీ ‘ఐదో కుమారుడు’.. రూ.14 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం

Videos

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

ది హిందూ కథనంపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్

బంగారం ధరల్లో ట్విస్ట్! పండక్కి ముందే రివర్స్ గేర్...

రైల్వే ట్రాక్ పై కుప్పకూలిన క్రేన్.. వేగంగా ఢీకొట్టిన రైలు

Photos

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా ‘కే హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్‌ డే– 2026’ (ఫొటోలు)