Breaking News

ఈఎస్ఐ సేవలకు ఆధార్‌.. ఇక తప్పనిసరి కాదు..

Published on Sat, 08/23/2025 - 15:51

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) పథకం సేవలకు ఆధార్‌.. ఇక తప్పనిసరి కాదు.  బీమా చేసిన వ్యక్తులు, వారి కుటుంబాలకు ఆధార్ ఆధారిత ధృవీకరణ ఐచ్ఛికంగానే ఉంటుందని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) స్పష్టం చేసింది. ఈఎస్ఐ పథకం లబ్ధిదారులు ఆధార్ ద్వారా ధృవీకరించుకోకపోయినా తమ వైద్య, నగదు ప్రయోజనాలను పొందగలరు.

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కింద చట్టబద్ధమైన సంస్థగా, ఈఎస్ఐసీ సంఘటిత రంగంలోని కార్మికులకు సమగ్ర ఆరోగ్య బీమా, సామాజిక భద్రతను అందిస్తుంది. ఇందులో వైద్య సంరక్షణ, అనారోగ్యం, ప్రసూతి ప్రయోజనాలు, వికలాంగుల పరిహారంతోపాటు స​భ్యులపై ఆధారపడినవారికి పెన్షన్లు ఉన్నాయి.

బెనిఫిట్ డెలివరీని సులభతరం చేయడానికి, కాగిత ప్రక్రియను తగ్గించడం కోసం గతంలో ఆధార్ ధృవీకరణను ప్రవేశపెట్టినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వివరించింది. అయితే ఆధార్ వెరిఫికేషన్ లేని కారణంతో లబ్ధిదారులకు సేవలను నిరాకరించబోమని ఈఎస్ఐసీ స్పష్టం చేసింది. ఆధార్ స్థానంలో పాస్ పోర్టులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది.

మరిన్ని సేవలు.. ​కొత్త పోర్టల్‌
ఈఎస్‌ఐసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు పలు కీలక కార్యక్రమాలను లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కార్మిక మంత్రిత్వ శాఖ వివరించింది.  ద్వితీయ, తృతీయ ఆరోగ్య సేవలను  మెరుగుపరచడానికి ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎంజెఎవై) ఆసుపత్రులతో సహకారం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.  శాశ్వత అంగవైకల్యం పొందిన సభ్యులు, వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు పరిహారాన్ని మరింత పెంచినట్లు వివరించింది.

బీమా లబ్ధిదారులు, ముఖ్యంగా మహిళలు నగదు ప్రయోజన క్లెయిమ్లను డిజిటల్‌గా సమర్పించడానికి వీలు కల్పించే కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించినట్లు పేర్కొంది.

ఈఎస్‌ఐ పథకానికి ఎవరు అర్హులు?
ఈఎస్‌ఐ పథకం ఉద్యోగులందరికీ వర్తించదు. ఎవరైతే నెలకు రూ.21 వేలు లేదా అంత కంటే తక్కువ జీతం పొందుతున్నారో వారికే ఈ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ వర్తిస్తుంది. అదే దివ్యాంగ ఉద్యోగులు అయితే రూ.25 వేల వరకూ జీతం పొందుతున్నవారు కూడా ఈ పథకానికి అర్హులు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)