Breaking News

100 గిగావాట్ల అణుశక్తి లక్ష్యానికి ఎల్‌ అండ్‌ టీ తోడ్పాటు

Published on Sat, 02/15/2025 - 13:44

భారతదేశం 2047 నాటికి ప్రతిష్టాత్మకంగా 100 గిగావాట్ల అణు ఇంధన లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాలని లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) దృష్టి సారించింది. భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ లక్ష్యం దేశ అణు విద్యుత్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు, స్థిరమైన ఇంధన సరఫరాను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎల్ అండ్ టీ వ్యూహాత్మక విజన్

భారత అణు విద్యుత్ వృద్ధికి దోహదపడేందుకు కంపెనీ కట్టుబడి ఉందని ఎల్ అండ్ టీ హోల్ టైమ్ డైరెక్టర్, ఎనర్జీ ప్రెసిడెంట్ సుబ్రమణియన్ శర్మ స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రోలైజర్ తయారీ, బ్లూ అమ్మోనియా ప్రాజెక్టుల్లో అవకాశాలను అన్వేషిస్తూ అణు రంగంలో తన ఉనికిని విస్తరించాలని ఎల్ అండ్ టీ యోచిస్తోంది. భవిష్యత్ ప్రాజెక్టుల కోసం సహకారం, భూసేకరణ కోసం చర్చలు జరుపుతోంది. అణువిద్యుత్ రంగంలో విభిన్న సేవలందించాలని ఎల్ అండ్ టీ లక్ష్యంగా పెట్టుకుంది. అణు రియాక్టర్ల తయారీదారుగా ఇది కీలకమైన రియాక్టర్లు, విడిభాగాలను అందిస్తోంది. ప్రభుత్వ భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా భారత్ స్మాల్ రియాక్టర్ల ఏర్పాటుకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఎల్ అండ్ టీ చర్చలు జరుపుతోంది.

ఇదీ చదవండి: మెటా ఇండియా-యూఎస్‌ సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్

క్రియాశీల వైఖరి

గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశించడంతో భారత్‌తోపాటు విదేశాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఎల్ అండ్ టీ ప్రయత్నిస్తోంది. కంపెనీ గుజరాత్‌లోని కాండ్లాలో భూమి కొనుగోలు చేసింది. ఇది ఎగుమతుల కోసం ఓడరేవుల సమీపంలో సౌకర్యాలకు అనువుగా ఉంటుందని భావిస్తుంది. ఒడిషాలో కొంత భూమి కొనుగోలు చేయాలని చూస్తోంది. ఎల్ అండ్ టీ క్రియాశీల వైఖరి దేశ అణు శక్తి లక్ష్యాలకు గణనీయంగా దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.

#

Tags : 1

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)