ఓలా సీఈఓ జాబ్‌ ఆఫర్‌.. ఓకే అన్న క‌మెడియ‌న్‌!

Published on Wed, 10/30/2024 - 13:10

ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రాకు జాబ్‌ ఆఫర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్‌ను అంగీకరించాలంటే తనకు కొన్ని షరతులు ఉన్నాయని కునాల్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్‌ సర్వీసు సెంటర్‌ వద్ద పోగైన వాహనాల ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో కంపెనీ సీఈఓ భవిష్‌ అగర్వాల్‌, కునాల్‌ కమ్రాల మధ్య మాటల యుద్ధం సాగింది.

ప్రభుత్వ విభాగమైన సెంట్రల్ కన్జూమర్‌ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఇయితే ఈ ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించిందని కంపెనీ ఇటీవల పేర్కొంది.

ఇదీ చదవండి: సైబర్‌ దొంగ.. ఏఐకూ బెంగ!

ఈ పరిణామాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ కునాల్‌ కమ్రాకు జాబ్‌ ఆఫర్‌ చేశారు. దానిపై కునాల్‌ ఎక్స్‌ వేదికగా కొన్ని డిమాండ్‌లను లేవనెత్తారు. వాటిని తీరిస్తే తాను జాబ్‌లో చేరుతానని చెప్పారు. ‘ఓలాతో కలిసి పనిచేయడానికి కంపెనీ సీఈఓ ఆఫర్‌ను అంగీకరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నన్ను కంపెనీ విషయాలకు సంబంధించి వేలసార్లు ట్యాగ్ చేశారు. నేను ఓలా ఉద్యోగిగానే భావిస్తున్నాను. కంపెనీ ఆఫర్‌ను స్వీకరించాలంటే కొన్ని డిమాండ్‌లను తీర్చాలి.

  1. ఓలా సర్వీస్ సెంటర్లలో స్కూటర్‌ ఇచ్చిన కస్టమర్లకు ఏడు రోజుల్లో సర్వీస్‌ అందేలా కంపెనీ చర్య తీసుకోవాలి.

  2. ఏడు రోజులు దాటినా మరమ్మతులు పూర్తి కాకపోతే వేరే స్కూటర్‌ను తాత్కాలికంగా వినియోగదారులకు అందించాలి.

  3. స్కూటర్ రిపేర్ పూర్తయ్యే వరకు రోజువారీ రవాణా ఖర్చుల కింద రూ.500 ఇవ్వాలి.

  4. కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెండు బీమాలు అందించాలి. వాహనానికి ఒకటి, సర్వీస్‌లకు మరొకటి. కస్టమర్లకు సర్వీస్ ఇన్సూరెన్స్ ఉచితంగా అందించాలి’ అని కునాల్‌ అన్నారు.

Videos

బాబు,పవన్ లను ప్రశ్నిస్తే తప్పా..? గొంతు నొక్కే కుట్ర

పుష్ప శ్రీవాణిపై పోలీసుల ఓవరాక్షన్ చీర లాగి దురుసు ప్రవర్తన..

పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి బట్టబయలు!

పోలీస్ స్టేషన్ లో ఆనంద్ సాయి కొడుకు సందీప్

గాలి భాను ప్రకాష్ క్వారీలపై రోజా సంచలన వ్యాఖ్యలు

Hyd: సెప్టెంబర్ లోనూ ఇంతే.. వర్షాలపై IMD హెచ్చరిక

తెలంగాణ బీజేపీ నేతల అరెస్ట్..!

మాట ఇచ్చి తప్పింది మీరు మమల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు..?

అమెరికా రక్షణ శాఖలో తీవ్ర కలకలం!

AP: రైతులంటే ఎందుకు మీకు అంత కక్ష..?

Photos

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)