Breaking News

కేటీఎం తొలి ఎలక్ట్రిక్​ స్కూటర్‌ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!

Published on Wed, 06/14/2023 - 14:04

ఆటోమొబైల్​  దిగ్గజం కేటీఎం భారత మార్కెట్లో  ఎలక్ట్రిక్​ స్కూటర్ల ర్యాలీలో దూసుకొస్తోంది. త్వరలోనే ఇండియాలో ఎలక్ట్రిక్​ స్కూటర్‌ను తీసుకు రానుంది.  బజాజ్ సహకారంతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ధి  చేస్తోంది.

ఈ ఏడాది చివర్లో ఇటలీ మిలాన్​లో జరగనున్న ఈఐసీఎంఏ షోలో దీన్ని ఆవిష్కరించనుందదని  భావిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన  టెస్ట్ మ్యూల్‌లో ఎటువంటి బ్రాండింగ్ లేనప్పటికీ,   కేటీఎం లివరీతో కూడిన జాకెట్‌తో రైడర్‌  ఉండటంతో  ఈ స్కూటర్‌ను  విదేశాలలో పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది.  (మహీంద్రా థార్‌ దెబ్బకి రెండు ముక్కలైన ట్రాక్టర్‌? వైరల్‌ వీడియో)

కేటీఎం ఈ-స్కూటర్​  సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే కొంచెం పెద్దదిగా ఉండనుంది.   విండ్‌స్క్రీన్ కూడా పెద్దగా ఉన్నట్టు తెలుస్తోంది.  అల్లాయ్ వీల్స్, TFT డిస్‌ప్లే ,  ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు, ఎయిర్ డక్ట్‌,  ఫ్రెంట్​, రేర్​ వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​   ముఖ్య ఫీచర్లుగా కనిపిస్తున్నాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌, వెనుక భాగంలో తేలికపాటి అల్యూమినియం స్వింగార్మ్ , సింగిల్​/ డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ సిస్టెంతో లాచ్‌కానుందని అంచనా.  (అపుడు పాల ప్యాకెట్‌ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)

2025 ప్రారంభంలో  లాంచ్‌  కానున్న ఈ కేటీఎం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బజాజ్ చకాన్ ప్లాంట్‌లో చేసి  ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ధరలపై  ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)