Breaking News

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌పై పెట్టుబడులు.. మూడు రెట్లు పెరిగాయ్‌

Published on Tue, 09/26/2023 - 07:55

న్యూఢిల్లీ: టెక్నాలజీపై పెట్టుబడులు కంపెనీల పనితీరును ఇతోధికం చేస్తున్నట్టు ‘కేపీఎంజీ గ్లోబల్‌ టెక్‌ రిపోర్ట్‌ 2023’ తెలిపింది. టెక్నాలజీల సాయంతో కంపెనీలు తమ లాభాలను 10 శాతానికి పైగా పెంచుకోగలుగుతున్నట్టు, గతేడాది 2.5 శాతంతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్టు పేర్కొంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా, అనలైటిక్స్‌ తదితర అత్యాధునిక టెక్నాలజీ, టూల్స్‌పై కంపెనీల పెట్టుబడులు మూడు రెట్లు పెరిగినట్టు వెల్లడించింది.

కేపీఎంజీ ప్రపంచవ్యాప్తంగా 2,100 మంది టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌లను (కంపెనీలకు సంబంధించిన) సర్వే చేసి ఈ వివరాలను నివేదిక రూపంలో విడుదల చేసింది. కంపెనీలు డిజిటల్‌ పరివర్తనంలో భాగంగా అనుసరిస్తున్న టెక్నాలజీ వ్యూహాలను ఈ నివేదిక ఏటా తెలియజేస్తుంటుంది.  

► ఏఐ, క్లౌడ్‌తో తమ పనితీరు, లాభదాయకత గణనీయంగా పెరిగినట్టు 63 శాతం మంది సర్వేలో తెలిపారు.  

► వర్ధమాన టెక్నాలజీలను అందిపుచ్చుకునే ధోరణి గతేడాది ఉన్న 10 శాతం నుంచి 38 శాతానికి పెరిగింది.  

► కంపెనీల లక్ష్యాల సాధనకు ఏఐ ఎంతో ముఖ్యమైన టెక్నాలజీగా అవతరించింది.  

► టెక్నాలజీ వల్ల ఉద్యోగుల ఉత్పాదకత పెరిగినట్టు 72 శాతం మంది చెప్పారు.  

► వచ్చే రెండేళ్లలో టెక్నాలజీ కార్యకలాపాల పరంగా ఈఎస్‌జీ ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళతామని 48 శాతం మంది చెప్పారు.  

► వివిధ టెక్నాలజీ కార్యకలాపాల్లో సమన్వయం లేమి పురోగతికి అడ్డంకింగా నిపుణులు పేర్కొన్నారు.  

►కస్టమర్‌ అనుభవం, ఈఎస్‌జీ, సైబర్‌ సెక్యూరిటీ టెక్నాలజీ ఆవిష్కరణలకు కీలక చోదకాలుగా ఈ సర్వే పేర్కొంది.  

► వచ్చే కొన్నేళ్లలో ఏఐపై మరింత దృష్టి సారించడం డిజిటల్‌ పరివర్తనానికి కీలకమని తెలిపింది.  

► స్వల్పకాల వ్యాపార లక్ష్యాలకు ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ తమకు ప్రాధాన్యమైనవిగా 68 శాతం మంది చెప్పారు. గతేడాది ఇలా చెప్పిన వారు 57 శాతంగా ఉన్నారు.  

► టెక్నాలజీ అమలులో భద్రత కీలకమని ఈ సర్వే స్పష్టం చేసింది. ఆరంభ ప్రాజెక్టుల్లో రిస్క్‌ నిర్వహణ అనేది టెక్నాలజీ పరివర్తన కార్యక్రమాల విజయానికి కీలకమని 62 శాతం కంపెనీలు తెలిపాయి. భారత్‌లో అయితే ఇలా చెప్పిన కంపెనీలు 88గా ఉన్నాయి.    

#

Tags : 1

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)