Breaking News

కోటక్‌ బ్యాంకు అలెర్ట్‌.. ‘డెబిట్ కార్డులు పని చేయవు’

Published on Thu, 02/06/2025 - 08:29

కోటక్ మహీంద్రా బ్యాంక్ తన బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో మెయింటెనెన్స్‌ సర్వీసులపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. దాంతో కొన్ని బ్యాంకింగ్‌ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. కోటక్ వీసా డెబిట్ కార్డు, స్పెండ్జ్ కార్డుకు సంబంధించిన సేవలు కొంత సమయంపాటు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈ మెయింటెనెన్స్‌ సర్వీసులకు సంబంధించి బ్యాంక్ తన ఖాతాదారులకు ఇప్పటికే ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది. సేవల్లో అసౌకర్యాన్ని నివారించడానికి తదనుగుణంగా వారి లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది.

ఇదీ చదవండి: ఇండిగోకు రూ.115.86 కోట్ల జరిమానా

అంతరాయం ఎప్పుడంటే..

ఫిబ్రవరి 5, 2025, ఫిబ్రవరి 12, 2025న రెండు రోజుల్లో తెల్లవారుజామున 1:00 గంటల నుంచి ఉదయం 5:00 గంటల వరకు నిర్వహణ కార్యకలాపాలు జరుగుతాయని బ్యాంకు పేర్కొంది. ఇన్‌స్టోర్‌ పీఓఎస్‌ లావాదేవీలు, ఆన్‌లైన్‌ లావాదేవీలు, అంతర్జాతీయ ఏటీఎం ఉపసంహరణలు వంటి సేవలు కోటక్‌ వీసా డెబిట్ కార్డ్, స్పెండ్జ్ కార్డ్ వినియోగదారులకు అందుబాటులో ఉండవని వివరించింది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఇతర బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండదని బ్యాంక్ తెలిపింది. అంతరాయంలేని బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి ఈ మెయింటెనెన్స్ అవసరమని ఖాతాదారులకు బ్యాంక్ హామీ ఇచ్చింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)