Breaking News

కోటక్ మహీంద్రా బ్యాంక్‌ చార్జీల్లో మార్పులు

Published on Sat, 05/25/2024 - 15:48

కోటక్ మహీంద్రా బ్యాంక్ శాలరీ అకౌంట్‌, పొదుపు ఖాతాలపై కొన్ని సేవలకు ఛార్జీలను సవరించింది. మే 1 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. యావరేజ్ బ్యాలెన్స్, నగదు, ఏటీఎం లావాదేవీలకు పరిమితులు, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఫెయిల్యూర్‌ ఫీజు, ఉచిత చెక్‌బుక్‌ల పరిమితికి సంబంధించిన ప్రమాణాలను బ్యాంక్ అప్‌డేట్ చేసింది.

కీలక మార్పులు ఇవే..
⇒ సగటు బ్యాలెన్స్ ప్రమాణాలు
సంకల్ప్ సేవింగ్స్ అకౌంట్: సెమీ అర్బన్ అండ్ రూరల్‌లో రూ.2,500.
రోజువారీ పొదుపు ఖాతా: మెట్రో అండ్ అర్బన్‌లో రూ.15,000, సెమీ అర్బన్‌లో రూ.5,000, రూరల్‌లో రూ.2,500.

⇒ ఉచిత నగదు లావాదేవీ పరిమితులు
డైలీ సేవింగ్స్/శాలరీ అకౌంట్, ప్రో సేవింగ్స్, క్లాసిక్ సేవింగ్స్ అకౌంట్లలో ఇప్పుడు నెలకు 5 ఉచిత లావాదేవీలు లేదా గరిష్టంగా రూ .2 లక్షలకు పరిమితం చేసింది.
ప్రివీ నియాన్/మాక్సిమా ఖాతాలకు సంబంధించి ఇప్పుడు నెలకు 7 ఉచిత లావాదేవీలు లేదా రూ.5 లక్షలకు పరిమితం చేసింది. అలాగే సోలో సేవింగ్స్ ఖాతాకు నెలకు ఒక ఉచిత లావాదేవీ లేదా రూ.10,000 కు తగ్గించింది.

⇒ ఏటీఎం లావాదేవీ పరిమితులు
ఎవ్రీడే సేవింగ్స్‌, క్లాసిక్ సేవింగ్స్, ప్రో సేవింగ్స్, ఏస్ సేవింగ్స్, ప్రివీ ఖాతాదారులకు కోటక్ ఏటీఎంలలో నెలకు 7 ఉచిత ట్రాన్సాక్షన్లు, ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే  నెలకు 7 ఉచిత లావాదేవీలు ఉంటాయి.
కోటక్, ఇతర బ్యాంకు ఏటీఎంలలో కలిపి నెలకు గరిష్టంగా 30 ఉచిత లావాదేవీలు ఉంటాయి.

ఇక ఎవ్రీడే శాలరీ, ఎడ్జ్ శాలరీ అకౌంట్లకు కోటక్ ఏటీఎంలలో నెలకు 10 ఉచిత ట్రాన్సాక్షన్స్, ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఎలాంటి మార్పు లేదు. అపరిమిత ఉచిత లావాదేవీలు ఉంటాయి.

⇒ స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఫెయిల్యూర్ ఫీజు
సేవింగ్స్‌, శాలరీ అకౌంట్‌లన్నింటికీ రూ.200 చొప్పున కొత్త రుసుము విధించనున్నారు. గతంలో ఎలాంటి చార్జీలు ఉండేవి కావు.

⇒ చెక్ బుక్ లిమిట్
సోలో సేవింగ్స్ అకౌంట్: ఏడాదికి 25 ఉచిత చెక్ లీవ్స్ నుంచి 5 ఉచిత చెక్ లీఫ్లకు తగ్గించారు.

⇒ లావాదేవీ వైఫల్య రుసుము
డెబిట్ కార్డు/ఏటీఎం వినియోగ రుసుము: సరిపడా నిధులు లేకపోవడం వల్ల లావాదేవీలు విఫలమైతే  ఒక్కో లావాదేవీకి రూ.25 చార్జీ ఉంటుంది. 
చెక్ జారీ చేసినప్పుడు, రిటర్న్ చేసినప్పుడు తీసుకునే ఫీజు రూ.250కి పెరిగింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)