Breaking News

కొటక్‌ బ్యాంక్‌ లాభం అప్‌

Published on Mon, 05/01/2023 - 06:36

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రయివేట్‌ రంగ దిగ్గజం కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 14 శాతంపైగా వృద్ధితో రూ. 4,566 కోట్లను తాకింది. ఇక స్టాండెలోన్‌ నికర లాభం మరింత అధికంగా 34 శాతం జంప్‌చేసి రూ. 3,496 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్‌ స్టాండెలోన్‌ నికర లాభం రూ. 8,573 కోట్ల నుంచి రూ. 10,939 కోట్లకు ఎగసింది.

కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 35 శాతం బలపడి రూ. 6,103 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 5.75 శాతంగా నమోదయ్యాయి. ఇతర ఆదాయం 30 శాతం పుంజుకుని రూ. 2,186 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.34 శాతం నుంచి 1.78 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 21.80 శాతంగా నమోదైంది. గతేడాది క్యూ4లో అనుబంధ సంస్థలలో కొటక్‌ ప్రైమ్‌ నికర లాభం రూ. 313 కోట్ల నుంచి రూ. 224 కోట్లకు వెనకడుగు వేసినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. అకౌంటింగ్‌ విధానాలలో మార్పు ఇందుకు కారణమైనట్లు పేర్కొంది. ఆటుపోట్ల మార్కెట్‌ కారణంగా క్యాపిటల్‌ మార్కెట్‌ ఆధారిత అనుబంధ సంస్థ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లాభం మాత్రం రూ. 192 కోట్లకు మెరుగుపడినట్లు తెలియజేసింది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు