Breaking News

అదానీ కంపెనీల్లో కోటక్‌ బ్యాంక్‌ ఎక్స్‌పోజర్‌

Published on Fri, 03/10/2023 - 05:55

ముంబై: అదానీ గ్రూపు కంపెనీల్లో కోటక్‌ మహీంద్రా బ్యాంకుకు సైతం కొంత ఎక్స్‌పోజ ర్‌ (పెట్టుబడులు/రుణాలు) ఉన్నట్టు బ్యాంక్‌ అంగీకరించింది. అయితే, ఇది తమ క్రెడిట్‌ సూత్రాలకు లోబడే ఉన్నట్టు హోల్‌సేల్‌ బ్యాంకింగ్‌ ప్రెసిడెంట్‌ పరితోష్‌ కాశ్యప్‌ తెలిపారు. ‘‘అదానీ గ్రూపు చుట్టూ ఉన్న అంశాలు అన్నీ కూడా క్యాపిటల్‌ మార్కెట్, మార్కెట్‌ విలువలకు సంబంధించినవి. రుణ పరపతి గురించి కాదు. మాకు స్వల్ప ఎక్స్‌పోజర్‌ ఉంది. దేశంలోని ప్రతి కార్పొరేట్‌తో మాకు వ్యాపారం ఉంటుంది.

కాకపోతే ఇది మా క్రెడిట్‌ సూత్రాలకు లోబడే ఉంది’’అని చెప్పారు. అదానీ గ్రూప్‌ కంపెనీలకు రుణ భారం సహేతుక స్థాయిలో ఉందన్నారు. అలాగే, బలమైన లాభదాయకత, బ్యాలన్స్‌ షీట్లను కలిగి ఉన్నట్టు చెప్పారు. అమె రికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ.. అదానీ గ్రూప్‌ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు ఉన్నా యని, కంపెనీల షేర్లను కృత్రిమంగా పెంచినట్టు ఆరోపణలు చేయడం తెలిసిందే. దీన్ని అదానీ గ్రూప్‌ ఖండించినప్పటికీ.. కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు సెబీ దర్యాప్తునకు కూడా ఆదేశించడం గమనార్హం.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు