Breaking News

ఈ ఎలక్ట్రిక్‌ బండి 350 కేజీలు మోస్తుంది.. ఒక్కసారి చార్జ్‌కి 150 కిలోమీటర్లు!

Published on Tue, 05/30/2023 - 14:08

సరుకు రవాణా అవసరాల కోసం ఎక్కువ మొత్తంలో బరువు తీసుగల టూ వీలర్‌ కోసం చేస్తున్నారా.. అది కూడా ఎలక్ట్రిక్‌ బండి  (Electric Scooter) కావాలా.. అయితే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఒక్కసారి పరిశీలించండి..

పొలం దగ్గరకు వెళ్లడానికి, ఎరువు బస్తాలు, కూరగాయలు, ఇతర బరువైన వస్తువులు తీసుకువెళ్లడానికి కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0 ( KOMAKI XGT CAT 2.0) సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది ఏకంగా 350 కేజీల బరువునైనా లాగగలదు. రైతులు, కూరగాయలు, ఇతర చిరు వ్యాపారులు, దుకాణదారులు ఈ బండిలో సరుకు రవాణా చేయవచ్చు. పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు. ఇంకా మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే.

రేంజ్‌, ఫీచర్లు, ధరలు
కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0 బండిని ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఎక్స్‌ట్రా క్యారియర్, బీఎల్‌డీసీ హబ్ మోటార్, పార్కింగ్ అసిస్ట్, ఆటో రిపేర్, మల్టీపుల్ సెన్సార్స్, సెల్ఫ్ డయాగ్నసిస్, వైర్‌లెస్ అప్‌డేట్స్, స్మార్ట్ డ్యాష్ బోర్డ్, బ్యాక్ ఎల్ఈడీ లైట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అలాగే ఎకో, స్పోర్ట్, టర్బో అనే మూడు రైడింగ్ మోడ్స్ ఇందులో ఉంటాయి. మొబైల్ చార్జింగ్ పాయింట్, లాక్ బై రిమోట్, టెలీస్కోపిక్ షాకర్, రిపేర్ స్విచ్, యాంటీ థెఫ్ట్ లాక్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఫోల్డబుల్ సీటు మరో ప్రత్యేకత. 

ఇక కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0లో రెండు వేరియంట్‌లు ఉన్నాయి. కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న దాని ప్రకారం.. 72వీ 31 ఏహెచ్ వేరియంట్‌ ధర రూ.1.01 లక్షలు . దీని రేంజ్ 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 72వీ 44 ఏహెచ్ వేరియంట్ ధర రూ. 1.14 లక్షలు. దీని రేంజ్ 150 కిలోమీటర్ల వరకు ఉంది.

ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్‌ బైక్‌లు కొనేవారికి బ్యాడ్‌ న్యూస్‌.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం!

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు