Breaking News

ధర ఎక్కువైనా.. ఆ ఇళ్లకే డిమాండ్!

Published on Wed, 01/07/2026 - 21:20

నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన.. ఇండియా రియల్ ఎస్టేట్: ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ మార్కెట్.. జూలై నుంచి డిసెంబర్ 2025 వరకు మొత్తం అమ్మకాలు స్థిరంగా ఉన్నాయని వెల్లడించింది. దేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో మొత్తం 3.48 లక్షల ఇళ్ల అమ్మకాలు జరగడం ద్వారా.. మార్కెట్ బలాన్ని నిలుపుకున్నప్పటికీ, గత సంవత్సరంతో పోలిస్తే కేవలం 1 శాతం స్వల్ప తగ్గుదల మాత్రమే నమోదైందని స్పష్టం చేసింది.

నగరాల వారీగా చూస్తే, ముంబై దేశంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ మార్కెట్‌గా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2025లో ముంబైలో సుమారు 97 వేల ఇళ్లు అమ్ముడయ్యాయి. భూమి లభ్యత పరిమితంగా ఉన్నప్పటికీ, ధరలు పెరుగుతున్నా కూడా ఇక్కడ డిమాండ్ నిలకడగా కొనసాగింది. మరోవైపు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో అమ్మకాలు 9 శాతం తగ్గినప్పటికీ, ఇళ్ల ధరలు ఏకంగా 19 శాతం పెరిగాయి.

బెంగళూరు మార్కెట్ స్థిరంగా కొనసాగుతూ, ఎండ్-యూజర్ డిమాండ్ ఆధారంగా అమ్మకాలను నిలబెట్టుకుంది. చెన్నై & హైదరాబాద్ నగరాలు 2025లో గణనీయమైన వృద్ధిని చూపాయి. ముఖ్యంగా చెన్నైలో 12 శాతం అమ్మకాల వృద్ధి నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్‌లో కూడా ధరలు & అమ్మకాలు రెండింటిలోనూ పెరుగుదల కనిపించింది.

ధరల విషయానికి వస్తే.. 2025లో అన్ని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయి. ముఖ్యంగా కోటి రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల అమ్మకాలు.. మొత్తం మార్కెట్‌లో సగం వాటాను దక్కించుకున్నాయి. కాగా 50 లక్షల రూపాయల ఖరీదైన ఇళ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)