Breaking News

అందుబాటు ధరల్లో ఇళ్లు... విలువ రూ. 67 లక్షల కోట్లు

Published on Wed, 12/04/2024 - 18:02

దేశంలో 2030 నాటికి దాదాపు రూ.67 లక్షల కోట్లు విలువ చేసే గృహాల కొరత ఉండబోతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని వర్గాల ప్రజలకు 3.12 కోట్ల కొత్త ఇళ్లు అవసరం అవుతాయని ఇండస్ట్రీ బాడీ సీఐఐ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా బుధవారం జరిగిన ఒక సమావేశంలో సంయుక్తంగా ‘అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి.

నివేదికలోని వివరాల ప్రకారం..

  • పెరుగుతున్న పట్టణీకరణ, ఉపాధి అవకాశాల వల్ల 2030 నాటికి దేశంలోని వివిధ పట్టణ కేంద్రాల్లో 2.2 కోట్ల గృహాలు అవసరం అవుతాయి.

  • ఇందులో 2.1 కోట్ల గృహాలు(95.2 శాతం) ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి అందుబాటులో ఉండాలి.

  • ప్రస్తుతం 1.1 కోట్ల యూనిట్ల ఇళ్ల కొరత ఉంది. మొత్తంగా 2030 నాటికి వీటి డిమాండ్‌ 3.2 కోట్లకు చేరనుంది.

  • ఈమేరకు దేశవ్యాప్తంగా దాదాపు రూ .67 లక్షల కోట్ల రియల్టీ వ్యాపారం జరుగుతుందని అంచనా.

  • ప్రస్తుతం గృహాల కొనుగోలు రుణ మార్కెట్ విలువ రూ.13 లక్షల కోట్లుగా ఉంది. అందులో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీ) రూ.6.9 లక్షల కోట్లు, షెడ్యూల్డ్ కమర్షియల్‌ బ్యాంకులు (ఎస్‌సీబీ) రూ .6.2 లక్షల కోట్ల రుణ విలువను కలిగి ఉన్నాయి.

  • భవిష్యత్తులో వివిధ ఆర్థిక సంస్థలు అందజేసే గృహ రుణ వాటా మరింత పెరగనుంది.

  • కొత్తగా ఇళ్లు కొనేవారు దాదాపు 77 శాతం మంది 2030 నాటికి రుణాలు తీసుకుంటారని అంచనా.

  • మొత్తం రూ.67 లక్షల కోట్ల మార్కెట్‌లో దాదాపు రూ.45 లక్షల కోట్లు బ్యాంకులు, హెచ్‌ఎఫ్‌సీలు ప్రజలకు ఫైనాన్సింగ్ ఇచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: గగనతలంలో 17 కోట్ల మంది!

నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ..‘2030 నాటికి దేశంలో పెద్దమొత్తంలో గృహాలు అవసరం అవుతాయి. అప్పటివరకు చాలా ఇళ్ల కొరత కూడా ఏర్పడనుంది. ప్రధానంగా పట్టణ కేంద్రాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటికి డిమాండ్‌ ఏర్పడుతుంది’ అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)