Breaking News

ఏడాది తర్వాత మార్కెట్లో లాంచ్ అయిన కారు.. ధర ఎంతంటే?

Published on Thu, 10/03/2024 - 13:52

ఇండియన్ మార్కెట్లో నాల్గవ తరం కియా కార్నివాల్ లాంచ్ అయింది. దీని ధర రూ. 63.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది కేవలం డీజిల్ ఇంజన్‌తో 7 సీటర్‌గా మాత్రమే లభిస్తుంది. ఈ కారు ప్రస్తుతం సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దేశానికి దిగుమతి అవుతుంది.

సరికొత్త కియా కార్నివాల్ భారతదేశంలో తయారైతే ధర కొంత తగ్గుతుంది. టయోటా ఇన్నోవా హైక్రాస్‌కు ప్రత్యర్థిగా ఉన్న కార్నివాల్.. కోసం కంపెనీ రూ. 2 లక్షల టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది. ఈ లేటెస్ట్ కారు దాని మునుపటి మోడల్ కంటే చాలా హుందాగా ఉంటుంది.

టైగర్ నోస్ గ్రిల్, ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో పాటు 18 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉన్న ఈ కారు ఎల్ఈడీ టెయిల్-లైట్స్ పొందుతుంది. ఈ కారు రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది.

2024 కియా కార్నివాల్ 12.3 ఇంచెస్ కర్వ్డ్ డిస్‌ప్లే, 4 స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌లు, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, పవర్డ్ స్లైడింగ్ రియర్ డోర్‌లను పొందుతుంది. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిస్క్ బ్రేక్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటర్, ఏడీఏఎస్ ఫీచర్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.

ఇదీ చదవండి: భారీగా పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఇవే

కొత్త కియా కార్నివాల్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 441 Nm టార్క్, 193 Hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కంపెనీ ఈ కారుకు మూడు సంవత్సరాల ఫ్రీ మెయినెనెన్స్, వారంటీ అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్‌ వంటివి అందిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)