Breaking News

కియా క్లావిస్ వచ్చేసింది: రేపటి నుంచే బుకింగ్స్..

Published on Thu, 05/08/2025 - 21:02

కియా కారెన్స్ క్లావిస్ మార్కెట్లో విడుదలైంది. కంపెనీ ఈ కారు బుకింగ్‌లను మే 9నుంచి స్వీకరించనుంది. దీనిని బ్రాండ్ వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఈ MPV ఆరు పవర్‌ట్రెయిన్ ఎంపికలు, ఏడు వేరియంట్‌ (HTE, HTE(O), HTK, HTK+, HTK+(O), HTX, HTX+)లలో  అందుబాటులో ఉంటుంది.

కొత్త డిజైన్ కలిగిన కియా క్లావిస్‌ డిజిటల్ టైగర్ ఫేస్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌లైట్‌, ఎల్ఈడీ డీఆర్ఎల్, యాంగ్యులర్ రియర్ బంపర్, డ్యూయల్ టోన్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌, లైట్ బార్, బ్రాండ్ లోగో వంటివి ఉన్నాయి. లోపల 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటి వాటితో పాటు.. ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్‌, 4-వే పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 8 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.

కియా క్లావిస్‌ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది ఐవరీ సిల్వర్ గ్లోస్, ప్యూటర్ ఆలివ్, ఇంపీరియల్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, స్పార్కింగ్ సిల్వర్, అరోరా బ్లాక్ పెర్ల్, క్లియర్ వైట్ అనే ఎనిమిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)