Breaking News

నెలలో కొత్తగా 14.63 లక్షల మంది చందాదారులు

Published on Wed, 01/22/2025 - 14:55

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నవంబర్ 2024 తాత్కాలిక పేరోల్ డేటాను విడుదల చేసింది. నవంబర్‌లో 14.63 లక్షల మంది సభ్యులు చేరినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. 2024 అక్టోబర్‌తో పోలిస్తే ఇది 9.07 శాతం అధికం. 2023 నవంబర​్‌తో పోలిస్తే ఈ సంఖ్యలో 4.88 శాతం పెరుగుదల నమోదైంది.

ఈపీఎప్‌వో తెలిపిన వివరాల ప్రకారం..

  • 2024 నవంబర్‌లో సుమారు 8.74 లక్షల మంది ఈపీఎఫ్‌లో కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారు. ఇది అక్టోబర్ 2024తో పోలిస్తే 16.58 శాతం అధికం.

  • 18-25 సంవత్సరాల మధ్య వయసువారు అత్యధికంగా 4.81 లక్షల మంది కొత్తగా సభ్యులుగా చేరారు. ఇది మొత్తం కొత్త సభ్యుల్లో 54.97%గా ఉంది.

  • సుమారు 2.40 లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా చేరారు. ఇది అక్టోబర్ 2024తో పోలిస్తే 14.94% పెరుగుదలను సూచించింది.

  • ఇటీవల కొత్తగా చేరిన మొత్తం సభ్యుల్లో 20.86% వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది.

ఇదీ చదవండి: అమెరికా చమురు ఎగుమతులు పెంపు

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) 7.6 కోట్లకుపైగా చందాదార్లకు ఇటీవల కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. యాజమాన్యం (కంపెనీ) నుంచి తనిఖీ లేదా ఈపీఎఫ్‌ఓ ఆమోదం లేకుండా ఉద్యోగులే వారి పేరు, పుట్టిన తేదీ, జాతీయత, లింగం, తల్లి/తండ్రి పేరు, జీవిత భాగస్వామి పేరు, కంపెనీలో చేరిన/రాజీనామా చేసిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో మార్చుకునే వెసులుబాటును తెచ్చింది. అంతేగాక ఆధార్‌ ఓటీపీ సాయంతో ఈపీఎఫ్‌ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టయితే యజమాని వద్ద పెండింగ్‌లో ఉన్న బదిలీ క్లెయిమ్‌ అభ్యర్థనను తొలగించి.. చందాదార్లు నేరుగా ఈపీఎఫ్‌ఓకు క్లెయిమ్‌ను సమర్పించవచ్చు.

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)