వాహన జోరుకు యూవీల తోడు

Published on Fri, 02/14/2025 - 08:35

తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్‌ వాహనాల సంఖ్య దేశవ్యాప్తంగా జనవరిలో 1.6 శాతం పెరిగి 3,99,386 యూనిట్లకు చేరుకున్నాయి. జనవరి నెలలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్‌ ఈ వృద్ధికి కారణం అని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) తెలిపింది.

‘2024 జనవరితో పోలిస్తే హోల్‌సేల్‌గా యూవీ(యుటిలిటీ వాహనాలు)ల విక్రయాలు గత నెలలో 6 శాతం అధికమై 2,12,995 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్‌ కార్స్‌ అమ్మకాలు స్థిరంగా 1,27,065 యూనిట్లు నమోదయ్యాయి. వ్యాన్స్‌ 6.4 శాతం క్షీణించి 11,250 యూనిట్లకు పడిపోయాయి. మారుతీ సుజుకీ 4 శాతం వృద్ధితో 1,73,599 యూనిట్లు, హ్యుండై మోటార్‌ 5 శాతం తగ్గి 54,003, మహీంద్రా 17.6 శాతం దూసుకెళ్లి 50,659 యూనిట్లు దక్కించుకున్నాయి. ద్విచక్ర వాహనాల హోల్‌సేల్‌ అమ్మకాలు 2.1 శాతం పెరిగి 15,26,218 యూనిట్లుగా ఉంది. మోటార్‌సైకిళ్లు 3.1 శాతం తగ్గి 9,36,145, స్కూటర్స్‌ 12.4 శాతం పెరిగి 5,48,201, మోపెడ్స్‌ స్వల్పంగా తగ్గి 41,872 యూనిట్లకు చేరుకున్నాయి. త్రిచక్ర వాహనాలు 7.7 శాతం ఎగిసి 58,167 యూనిట్లను తాకాయి’ అని వివరించింది.  

ఇదీ చదవండి: శ్రీలంక పవర్‌ ప్రాజెక్టుల నుంచి అదానీ బైటికి

టీవీఎస్‌ సప్లై చైన్‌లో మరింత వాటా

ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తాజాగా టీవీఎస్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌లో అదనపు వాటా కొనుగోలు చేసింది. బీఎస్‌ఈ బల్క్‌ డీల్‌ గణాంకాల ప్రకారం 1.52 శాతం వాటాకు సమానమైన 67.10 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా  ఇందుకు రూ. 107 కోట్లు వెచి్చంచింది. ఒక్కో షేరుకీ రూ. 159.42 సగటు ధరలో వీటిని కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ తదుపరి టీవీఎస్‌ సప్లై చైన్‌లో టీవీఎస్‌ మోటార్‌ వాటా 2.39 శాతం నుంచి 3.91 శాతానికి బలపడింది.

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)