Breaking News

అదానీపై కేసు ఎఫెక్ట్‌.. రూ.6,216 కోట్ల డీల్‌ రద్దు?

Published on Fri, 11/22/2024 - 09:18

అదానీ గ్రూప్‌తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃపరిశీలిస్తామని కెన్యా ప్రకటించింది. కెన్యాలో విమానాశ్రయ అభివృద్ధితోపాటు ఎనర్జీ ప్రాజెక్ట్‌ల విస్తరణ కోసం అదానీ గ్రూప్‌ గతంలో ఒప్పందం చేసుకుంది. ఇటీవల అదానీ సంస్థలపై చెలరేగుతున్న నేరాభియోగాల వల్ల కెన్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఉదంతం నుంచి కోలుకుని, క్రమంగా పుంజుకున్న అదానీ గ్రూప్‌నకు మళ్లీ షాక్‌ తగిలింది. భారత్‌లో భారీ సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌లు పొందేందుకు  దాదాపు రూ.2,200 కోట్లు (సుమారు 265 మిలియన్‌ డాలర్లు) లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీతో పాటు మరో ఏడుగురిపై మోసం, లంచం, అవినీతి కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: సోలార్‌ ఎనర్జీ తయారీ 20 రెట్లు వృద్ధి: ఐఎస్‌ఏ నివేదిక

ఈ నేపథ్యంలో కెన్యా అధ్యక్షుడు విలియం రుటో ప్రకటన విడుదల చేశారు. కెన్యాలో విమానాశ్రయాలు, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌లైన్ల విస్తరణకు అదానీ గ్రూప్‌తో గతంలో చేసుకున్న ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు చెప్పారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్‌ పూర్తి చేశాక దీనిపై పునరాలోచిస్తామన్నారు. ఈ డీల్‌ విలువ 736 మిలియన్‌ డాలర్లు(రూ.6216 కోట్లు). ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించారు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?