Breaking News

రూ.12.90 లక్షల కవాసకి కొత్త బైక్ ఇదే..

Published on Sat, 02/15/2025 - 16:03

కవాసకి కంపెనీ.. దేశీయ విఫణిలో కొత్త 'నింజా 1100ఎస్ఎక్స్' బైక్ లాంచ్ చేసిన.. దాదాపు రెండు నెలల తర్వాత, 'వెర్సిస్ 1100' (Kawasaki Ninja Versys 1100)ను రూ. 12.90 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. చూడటానికి వెర్సిస్ 1000 మాదిరిగే ఉండే.. ఈ బైక్ ఇప్పుడు శక్తివంతమైన ఇంజిన్ పొందుతుంది.

ఒకే వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన కవాసకి వెర్సిస్ 1100.. డ్యూయల్ టోన్ (మెటాలిక్ మాట్టే గ్రాఫేన్ స్టీల్ గ్రే / మెటాలిక్ డయాబ్లో బ్లాక్) ఫినిషింగ్ పొందుతుంది. ఈ బైక్ డెలివరీలు ఈ నెల (ఫిబ్రవరి 2025) చివరిలో ప్రారంభమవుతాయి.

కవాసకి వెర్సిస్ 1100లో ఉన్న అతిపెద్ద అప్డేట్ ఏమిటంటే.. 1099 సీసీ ఇంజిన్. ఇది 9000 rpm వద్ద 133 Bhp పవర్, 7600 rpm వద్ద 112 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇందులో క్విక్ షిఫ్టర్ కూడా అందుబాటులో ఉంది.

కవాసకి వెర్సిస్ 1100 సస్పెన్షన్.. అవుట్‌గోయింగ్ మోడల్ 1000 మాదిరిగానే ఉంటుంది. ముందు భాగంలో ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ 43 mm USD ఫోర్క్, వెనుక భాగంలో ప్రీ-లోడ్ మరియు రీబౌండ్ సర్దుబాటుతో గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్

ఫీచర్ల విషయానికొస్తే.. వెర్సిస్ 1100లో మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్, కవాసకి ఇంటెలిజెంట్ ఏబీఎస్, సెలక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్, USB టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్, అడ్జస్టబుల్ విండ్‌షీల్డ్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ బైక్ కొనుగోలుదారులకు అదనపు పరికలు లేదా యాక్ససరీస్ కావాలంటే కొనుగోలు చేయవచ్చు. బైకును మరింత అందంగా డిజైన్ చేసుకోవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)