Breaking News

July 8th 2023: మూడు నెలల కనిష్టానికి బంగారం ధర,మరింత పెరగకముందే కొనేద్దామా?

Published on Sat, 07/08/2023 - 20:05

రోజుకు రోజుకు దిగి వస్తున్న పసిడి ధరలు కొనుగోలు దారులను ఊరిస్తున్నాయి.  అమెరికా ఫెడ్‌ రేట్‌  పెంపు ఆందోళన  గ్లోబల్‌ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.  ఈప్రభావం బంగారం ధరలపై కూడా చూపిస్తోంది.  ముఖ్యంగా జూలై నెలలో బంగారం ధరలు  కూడా దిగి వస్తున్నప్పటికీ భారీ ఒడిదుడుకులు మధ్య  కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ కారణంగా దేశీ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు  తగ్గుముఖం  పట్టాయని బులియన్‌ మార్కెట్‌  నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే జూన్ నెలలో బంగారం ధరలు ఏకంగా 3.3 శాతం మేర తగ్గాయి. బంగారం ధరలు జూలై నెల తొలి వారాన్ని పెరుగుదలను నమోదు చేశాయి. శుక్రవారంతో ముగిసిన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌ (MCX)లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 10 గ్రా. రూ.392 ఎగిసింది. అయితే ఎంసీఎక్స్‌లో బంగారం ధర  దాదాపు రూ. 58,350 వద్ద మూడు నెలల కనిష్టానికి చేరిన తర్వాత మాత్రమే ఈ ర్యాలీ వచ్చింది. ధరల తగ్గుదల ఆగి పోయిందని భావిస్తున్నప్పటికీ రానున్న కాలంలో ఏ మాత్రం తగ్గినా ఈ అవకాశాన్ని మిస్‌ కాకుండా కొనుగోళ్లకు ఉపయోగించు కోవాలని సూచిస్తున్నారు. 

అమెరికా జాబ్‌ డేటా ,అమెరికా డాలర్‌పై కూడా ఒత్తిడి  తదితర అంశాలు బంగారం  ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర రూ.400పెరిగి రూ. 54550 వద్ద ఉంది. అటు 24  క్యారెట్ల పసిడి ధర  10 గ్రా.  రూ. 59510  వద్ద ఉంది.  అలాగే  వెండి ధర కిలో వెయ్యి రూపాయలు  ఎగిసి హైదరాబాద్‌లో రూ. 76700 పలుకుతోంది. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)