Breaking News

ఒక్క నెలలో ఇంత మంది టెకీల తొలగింపా?

Published on Thu, 08/01/2024 - 17:09

ఐటీ రంగంలో పరిస్థితులు ఇంకా మెరుగైనట్లు కనిపించడం లేదు. లేఆఫ్‌ల భయం ఉద్యోగులను ఇంకా వీడలేదు. గడిచిన జూలై నెలలో ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగించాయి. భారత్‌లోనూ గణనీయ సంఖ్యలో ఐటీ ఉద్యోగులు జాబ్స్‌ కోల్పోయారు.

ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు జూలై నెలలోనూ కొనసాగాయి. విదేశాలలోపాటు,  భారత్‌లోనూ పలు కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. గత నెలలో మొత్తంగా దాదాపు 8000 మంది ఉద్యోగాలు కోల్పోగా భారత్‌లో 600 మంది ఉద్వాసనకు గురయ్యారు. జూన్‌తో పోలిస్తే ఉద్యోగుల తొలగింపుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ, ప్రభావం గణనీయంగానే ఉంది.

జూలైలో ప్రధాన తొలగింపులు ఇవే
మసాచుసెట్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ యూకేజీ (UKG) తన వర్క్‌ఫోర్స్‌లో 14% మందిని తొలగించింది. మొత్తం 2,200 మంది ఇంటి బాట పట్టారు. కాలిఫోర్నియాకు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్‌ట్యూట్‌ (Intuit Inc.) కార్యకలాపాల క్రమబద్ధీకరణ పేరుతో దాదాపు 10% మంది అంటే 1,800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఓపెన్ టెక్స్ట్, రెడ్‌బాక్స్ కూడా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించాయి. అవి వరుసగా 1,200, 100 ఉద్యోగాలను తగ్గించాయి. భారతీయ ఎడ్‌టెక్ దిగ్గజం అన్‌కాడెమీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 100 మంది మార్కెటింగ్, బిజినెస్‌, ప్రొడక్షన్‌ ఉద్యోగులను, 150 మంది సేల్స్‌ సిబ్బందిని మొత్తంగా 250 మందిని తొలగించింది.

చెన్నైకి చెందిన అగ్రిటెక్ సంస్థ వేకూల్ 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా బెంగళూరు ఆధారిత ఆడియో సిరీస్ ప్లాట్‌ఫారమ్ పాకెట్‌ఎఫ్‌ఎం దాదాపు 200 మంది రైటర్లను తొలగించింది. ఇక ‘ఎక్స్‌’కి పోటీగా వచ్చిన భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ (Koo) డైలీహంట్‌తో కొనుగోలు చర్చలు విఫలమవడంతో మూతపడింది. దీంతో దాదాపు 200 మంది ఉద్యోగులపై ప్రభావం పడింది.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)