జ్యూస్ అమ్మే వ్యక్తికి రూ.7.79 కోట్ల ట్యాక్స్ నోటీస్

Published on Fri, 03/28/2025 - 10:18

2024-25 ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో అందరూ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన ఒక జ్యూస్ వ్యాపారి.. తనకు వచ్చిన ట్యాక్స్ నోటీస్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన మొహమ్మద్ రహీస్ జ్యూస్ అమ్ముకుంటూ జీవినం సాగిస్తున్నారు. మార్చి 18న అతనికి ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ నోటీస్ పంపించింది. అందులో రూ. 7.79 కోట్లు ట్యాక్స్ చెల్లించాలని ఉంది. ఇది చూడగానే అతడు షాక్‌కు గురయ్యాడు. దీనిపై మార్చి 28 లోపల స్పందించాలని ఉండడంతో అతనికి ఏమి చేయాలో పాలుపోలేదు.

భారీ మొత్తంలో చెల్లించాలని వచ్చిన ట్యాక్స్ నోటీసు గురించి కనుక్కోవడానికి.. స్నేహితులను సంప్రదించారు. వారు సంబంధిత అధికారులను కలుసుకోమని సలహా ఇచ్చారు. అధికారులు సైతం అతనికి వచ్చిన ట్యాక్స్ చూసి ఆశ్చర్యపోయారు. తాను రోజుకు కేవలం రూ. 500 నుంచి రూ. 600 మాత్రమే సంపాదిస్తానని, పెద్ద లావాదేవీలు ఎప్పుడూ చేయాలని.. అధికారులతో చెప్పాడు.

ఇదీ చదవండి: మార్చి 31 డెడ్‌లైన్‌.. ఇవన్నీ పూర్తి చేశారా?

బాధితుని పాన్ కార్డు వివరాలు ఎవరో వినియోగించి ఉండవచ్చని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. తన వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దోషులను శిక్షించి జైలుకు పంపాలని రహీస్ కోరుకున్నాడు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)