Breaking News

జేఎస్‌డబ్ల్యూ నిధుల సమీకరణ

Published on Wed, 07/02/2025 - 01:40

ముంబై: డ్యూలక్స్‌ బ్రాండ్‌ పెయింట్ల దిగ్గజం అక్సో నోబెల్‌ ఇండియా కొనుగోలుకి జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ నిధుల సమీకరణకు తెరతీసింది. దీనిలో భాగంగా కంపెనీ ప్రమోటర్లతోపాటు.. పీఈ దిగ్గజాలు పెట్టుబడులు సమకూర్చనున్నట్లు వెల్లడించింది. మరికొన్ని నిధులను రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కంపెనీ ఎండీ పార్ధ్‌ జిందాల్‌ తెలియజేశారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ గ్రూప్‌ కంపెనీ అంతర్గత వనరులు, ప్రమోటర్ల పెట్టుబడుల ద్వారా రూ. 7,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు వెల్లడించారు. మిగిలిన నిధులను పీఈ సంస్థలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఐదేళ్ల క్రితమే ప్రస్థానం ప్రారంభించిన జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ తాజాగా డచ్‌ దిగ్గజం అక్సో నోబెల్‌.. ఇండియా బిజినెస్‌ను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 13,000 కోట్లు వెచి్చంచనుంది. డీల్‌ పూర్తయితే జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ దేశీయంగా డెకొరేటివ్‌ పెయింట్ల విభాగంలో మూడో పెద్ద కంపెనీగా అవతరించనుంది. రానున్న మూడేళ్లలో టర్నోవర్‌ రూ. 7,500 కోట్లకు చేరనున్నట్లు అంచనా.

కాగా.. భారత్‌ నుంచి పూర్తిగా వైదొలగడంలేదని అక్సో నోబెల్‌ సీఈవో గ్రెగ్‌ పౌక్స్‌ గిలామీ తెలియజేశారు. పౌడర్‌ కోటింగ్స్‌ బిజినెస్, ఆర్‌అండ్‌డీ కంపెనీ చేతిలోనే కొనసాగనున్నట్లు  వెల్లడించారు. అయితే జేఎస్‌డబ్ల్యూకి సాంకేతిక భాగస్వామిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. లైసెన్సింగ్, రాయల్టీ ఒప్పందంకింద 4.5 శాతం అందుకోనున్నట్లు తెలియజేశారు. 

#

Tags : 1

JSW

Videos

Srikakulam: తల్లికి వందనం నగదు కోసం మహిళల ఆందోళన

Pothina Mahesh: దోపిడీని వ్యవస్థీకృతం చేసింది చంద్రబాబు కాదా

Municipal Workers: మా గోస తగిలిపోతావ్.. కూటమి ప్రభుత్వం నాశనమే

కేంద్రంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

Vidadala: ఎన్ని కేసులు పెట్టినా... తగ్గేదేలే 2029లో జగనే సీఎం

ఢాకాలో కూలిన బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం

HCA అధ్యక్షుడిగా జగన్మోహన్ దొడ్డిదారిన ఎన్నికైనట్లు గుర్తింపు

కోనేరు హంపికి వైఎస్ జగన్ అభినందనలు

ముంబై ఎయిర్‌పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం

నా నియోజకవర్గంలోని ఓ నేత నన్ను టార్గెట్ చేశారు : శ్రీగణేశ్

Photos

+5

విజయవాడలో అర్ధరాత్రి దంచికొట్టిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు రికార్డు స్థాయిలో భక్తుల సారె.. (ఫొటోలు)

+5

భాగ్యనగరంలో వైభవంగా బోనాల ఉత్సవాలు (ఫొటోలు)

+5

విజయనగరం: శ్రీ విజయ సాగర దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆషాడం సారే (ఫొటోలు)

+5

ట్రెండీ వేర్ కాదు.. చీరలో ఒకప్పటి హీరోయిన్ మీనా (ఫొటోలు)

+5

మెగా కోడలు ఉపాసన బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 20-27)

+5

హైదరాబాద్ లో ఘనంగా బోనాలు (ఫొటోలు)

+5

వరంగల్‌లో సినీనటి నిధి అగర్వాల్‌ సందడి (ఫొటోలు)

+5

లండన్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న నీరజ్ చోప్రా.. (ఫొటోలు)