Breaking News

ఆగస్టు 7న జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ఐపీఓ 

Published on Sun, 08/03/2025 - 06:38

ముంబై: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ పబ్లిక్‌ ఇష్యూ ఆగస్టు 7న ప్రారంభమై 9న ముగిస్తుంది. తొలుత ఇష్యూ సైజ్‌ రూ.4,000 కోట్లు ఉండగా.., దాన్ని రూ.3,600 కోట్లకు కుదించినట్లు ముసాయిదా పత్రాల్లో వెల్లడైంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌ ఆగస్టు 6న ఉంటుంది. ఇష్యూలో భాగంగా రూ.1,600 కోట్ల విలువైన తాజా ఈక్విటీలు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ.2,000 కోట్లు విలువైన షేర్లను విక్రయించనుంది.

 సమీకరించిన నిధుల్లో రూ.800 కోట్లతో రాజస్థాన్‌ నాగూర్‌లో ఇంటిగ్రిటెడ్‌ సిమెంట్‌ యూనిట్‌ నిర్మాణానికి, రూ.520 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ఆర్థిక సంవత్సరం 2025లో రూ.163.77 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. నిర్వహణ ద్వారా ఆదాయం రూ.6,028 కోట్ల నుంచి రూ.5,813 కోట్లను దిగివచ్చింది. మొత్తం రుణాలు రూ. 6,166 కోట్లు ఉన్నాయి.  

ఐపీఓకు ఏఆర్‌సీఐఎల్‌
అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(ఇండియా) లిమిటెడ్‌ (ఏఆర్‌సీఐఎల్‌), ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద ఉంటుంది. కావున కంపెనీకీ నిధులేవీ రావు. సంస్థ ప్రమోటార్లు, ఇతర షేర్‌ హోల్డర్లు ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా కంపెనీ 10.54 కోట్ల ఈక్విటీలను ఇష్యూ ద్వారా విక్రయించనున్నారు.

 ప్రమోటర్‌ సంస్థలు అవెన్యూ ఇండియా రిసర్జెన్స్‌ పీటీఈ లిమిటెడ్‌ 6.87 కోట్ల ఈక్విటీలు, ఎస్‌బీఐ 1.94 కోట్ల షేర్లు, ఫెడరల్‌ బ్యాంక్‌ 10.35 లక్షలు షేర్లను విక్రయించనున్నాయి. సింగపూర్‌కు చెందిన లాథే ఇన్వెస్ట్‌మెంట్‌ పీటీఈ లిమిటెడ్‌ తన మొత్తం 1.62 కోట్లు(5% వాటాకు సమానం) ఈక్విటీలను విక్రయించనుంది. ఇష్యూకు ఐఐఎఫ్‌ఎల్‌ క్యాపిటల్‌ సరీ్వసెస్, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, జేఎం ఫైనాన్స్‌లు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా, ఎంయూఎఫ్‌జీ ఇన్‌టైం ఇండియాలు రిజి్రస్టార్‌గా పనిచేయనున్నాయి.  
    


 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)