Breaking News

జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ లాభం డౌన్‌

Published on Sat, 07/15/2023 - 06:05

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికానికి(క్యూ1) నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం 48 శాతం క్షీణించి రూ. 290 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 560 కోట్లు ఆర్జించింది. ఇందుకు అనూహ్య(వన్‌టైమ్‌) నిర్వహణేతర వ్యయాలు ప్రభావం చూపాయి. దివాలా చట్ట మార్గంలో కంపెనీ ఇటీవల సొంతం చేసుకున్న మిత్రాతోపాటు, 700 మెగావాట్ల ఇండ్‌–బరత్‌ థర్మల్‌ ప్లాంటు లావాదేవీ లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది.

కాగా.. మొత్తం ఆదాయం 3 శాతం నీరసించి రూ. 3,013 కోట్లకు చేరింది. ఈ కాలంలో నికరంగా 6,699 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఇది 14 శాతం అధికంకాగా.. మిత్రా, పునరుత్పాదక ఇంధన(ఆర్‌ఈ) సామర్థ్య విస్తరణ ఇందుకు దోహదం చేశాయి. 2023 జూలై 14 నుంచి మూడేళ్ల కాలానికి రాజీవ్‌ చౌధ్రిని అదనపు, స్వతంత్ర డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.6% బలపడి రూ.304 వద్ద ముగిసింది.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)